BigTV English

Kalki2898AD: కల్కి సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ .. ?

Kalki2898AD: కల్కి సెన్సార్ రివ్యూ వచ్చేసింది..  పాన్ ఇండియా హిట్ గ్యారెంటీ .. ?

Kalki2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కల్కి2898AD. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మొట్టమొదటి సారి కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇక అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్నారు.


ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్ కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. అని అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.మరో 8 రోజుల్లో ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతుంది. జూన్ 27 న కల్కి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. వరుస ఇంటర్వ్యూ లు, ఈవెంట్స్ చేస్తూ బిజీగా మారారు.

ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సైన్స్ ఫిక్షన్ మైథలాజీకి సెన్సార్ సభ్యులు ఫిదా అయ్యినట్లు సమాచారం. అంతేకాకుండా కల్కి కథకు, విజువల్స్ కు వారు స్టాండింగ్ ఒవేషన్ కూడా ఇచ్చారట. ఒక్కో పాత్రను నాగీ మలిచిన తీరును ప్రశంసించకుండా ఉండలేకపోయారట.


ప్రభాస్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కనున్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పారట. ఆ విజువల్స్ అయితే హాలీవుడ్ ను తలిపిస్తున్నాయని, కల్కి హాలీవుడ్ సినిమానా.. ? టాలీవుడ్ మూవీనా అనే డౌట్ వస్తుందని తెలిపారని సమాచారం. ఎక్కడా రాజీ పడకుండా ఇలాంటి సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన వైజయంతీ మూవీస్ ను వారు ప్రశంసించారట.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే సినిమా మొత్తంలో ఎక్కడా నిరాశపర్చకుండా స్టార్ క్యాస్టింగ్.. మధ్య మధ్యలో స్టార్ సెలబ్రిటీల క్యామియోలతో థియేటర్ లో ఈలలు వేయడం ఖాయమట. అయితే సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా తగ్గినట్లు వారు అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. మొత్తానిక కల్కి పాన్ ఇండియాను షేక్ చేయడానికి రెడీ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ రివ్యూ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×