E-Paper
Advertisement

Maheshwaram : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. మహేశ్వరంలో జెండా పాతేది ఎవరు ?

Maheshwaram : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. మహేశ్వరంలో జెండా పాతేది ఎవరు ?
Advertisement

Maheshwaram Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో చూస్తే..

నియోజకవర్గం : మహేశ్వరం
జిల్లా : రంగారెడ్డి జిల్లా
మొత్తం ఓటర్లు: 5,17,241
పురుషులు: 2,66,628
మహిళలు : 2,50,546
ప్రస్తుత ఎమ్మెల్యే: సబితా ఇంద్రారెడ్డి (BRS)

Advertisement

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (05-11-2023)

తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సబితా ఇంద్రారెడ్డికి 35 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి 36 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. ఇక్కడ బీజేపీకి 23 శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

మారుతున్న మహేశ్వరం రాజకీయం

మహేశ్వరంలో ఈసారి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎదురుగాలి వీస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబిత గులాబీ గూటికి చేరారు. 12 మందితో కలిసి పార్టీ ఫిరాయించి ఏకంగా మంత్రి పదవి చేపట్టారు. ఈ ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించనుందని బిగ్ టీవీ సర్వేలో స్పష్టమైంది. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించి గులాబీ గూటికి చేరడం వల్ల ప్రజల విశ్వసనీయత కోల్పోయారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కిచ్చెన్నగారి లక్మారెడ్డికి 36 శాతం ఓట్ షేర్ దక్కనుంది. సబిత కంటే 1 శాతం ఓట్లు అధికంగా వస్తున్నాయి. మహేశ్వరంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌ మంచి ప్రభావం కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనకు 23 శాతం ఓట్లు దక్కనున్నాయని … ఇప్పటికిప్పుడు ప్రజాభిప్రాయంగా తేలింది.

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×