E-Paper
Advertisement

Station Ghanpur : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. స్టేషన్ ఘన్ పూర్ లో గెలుపెవరిది ?

Station Ghanpur : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. స్టేషన్ ఘన్ పూర్ లో గెలుపెవరిది ?
Advertisement

Station Ghanpur Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంపై తాజా సర్వే చేసింది. ఈ సెగ్మెంట్ లో 2,43,146 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,20,848 మంది ఉన్నారు. మహిళలు 1,22,132 మంది ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 ( 06-09-2023)..

Advertisement

బీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య 44 శాతం ఓట్లు సాధిస్తారని బిగ్ టీవీ చేసిన పందెం కోళ్లు-1 సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా దొమ్మాటి సాంబయ్య బరిలోకి దిగితే 39 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడైంది. బీజేపీకి 4 శాతం ఓట్లు వస్తాయని సర్వే తేల్చింది.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (04-11-2023)..

Advertisement

తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడైయ్యాయి. ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం శ్రీహరికి 40 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇందిర 45 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. బీజేపీకి కేవలం 3 శాతం ఓట్లే పోల్ అవుతాయని సర్వేలో తేలింది.

మారుతున్న లెక్కలు..

రెండు సర్వేల ఆధారంగా ఓట్ల లెక్కలు పరిశీలిస్తే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని అర్థమవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని స్పష్టంగా తేలింది. బీఆర్ఎస్ 4 శాతం ఓట్లను కోల్పోతుండగా.. కాంగ్రెస్ కు 6 శాతం ఓట్లు పెరుగుతున్నాయి.

స్టేషన్ ఘన్ పూర్ లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టిక్కెట్ దక్కలేదు. ఆయనకు రైతుబంధు సమితి ఛైర్మన్ పదవి ఇచ్చినా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే మంత్రి హరీష్ రావు కూడా మరోసారి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ క్యాడర్ కడియం శ్రీహరికి సహకరించేందుకు సుముఖంగా లేదు. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర విజయానికి పరిస్థితులు దోహదపడుతున్నాయి. సర్వే 1లో కాంగ్రెస్ అభ్యర్థి కంటే తాజా సర్వేలో టిక్కెట్ దక్కించుకున్న ఇందిరకు 6 శాతం ఓట్లు అధికంగా వస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. బీఎస్పీకి పందెంకోళ్లు 1 లో 8 శాతం ఓట్లు వస్తుండగా, సర్వే 2 లో కూడా అంతే ఓట్ షేర్ వచ్చింది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×