Hyderabad: హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట్ ప్రాంతం దశాబ్దాలుగా వర్షాకాలంలో వరదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ వచ్చింది. ప్రతి చిన్న వర్షంలోనూ రోడ్లు నీట మునిగి, ట్రాఫిక్ స్తంభించి, ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయే పరిస్థితి నెలకొనేది. అయితే ఈ ఏడాది ఈ సమస్యకు స్వస్తి పలికినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ ద్వారా అమీర్‌పేట్‌లో వరద కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. ఈ ఆపరేషన్ పూర్తి విజయవంతమైందని అధికారులు ప్రకటించారు. ఇటీవల కురిసిన 10 సెంటీమీటర్ల వర్షంలో కూడా పలు ప్రాంతాలు నీట మునగకపోవడం ఇందుకు నిదర్శనం.
ఆరు పైపులైన్లలో దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త-మట్టి
ఈ సమస్యకు కారణం ఏంటంటే, దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త, మట్టి, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఆరు ప్రధాన పైప్‌లైన్లు పూర్తిగా మూసుకుపోయాయి. ఈ పైప్‌లైన్లు నీటిని సరిగా బయటకు పంపలేకపోవడంతో వర్షం పడగానే రోడ్లపై నీరు నిలిచిపోతోంది. అధికారులు ఈ సమస్యను గుర్తించి, తక్షణమే చర్యలు చేపట్టారు. హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ సిబ్బందితో కలిసి సమన్వయంతో పూడిక తీత పనులు చేపట్టారు. ఈ బృందం రోజురాత్రి తేడా లేకుండా పని చేసి, నాలాలు, డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయి పర్యటన నగరమంతా ఇదే విధానం అమలు చేయాలని యోచన
హైడ్రా డైరెక్టర్ రంగనాథ్ స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి, పనులను పర్యవేక్షించారు. ఇప్పటివరకు 45 ట్రక్కుల పూడిక తొలగించినట్లు ఆయన తెలిపారు. ఈ పూడిక తీతలో ఆధునిక యంత్రాలు, సూపర్ సక్సెస్ మెషిన్లు ఉపయోగించారు.. ఫలితంగా మూడు ప్రధాన పైప్‌లైన్లు అందుబాటులోకి వచ్చాయి.
వచ్చే వర్షాకాలానికి ముంపు సమస్య ఉండదన్న రంగనాథ్
ఈ మూడు లైన్లు పని చేయడంతోనే ఈసారి 10 సెంటీమీటర్ల వర్షపాతం పడినా నీరు రోడ్లపై నిలవలేదు. మిగిలిన మూడు లైన్ల పనులు కూడా త్వరలో పూర్తి కాగా, మొత్తం వ్యవస్థ పునరుద్ధరణతో 15 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా తట్టుకునే సామర్థ్యం వస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది అమీర్‌పేట్‌లోని రోడ్లు, కాలనీలు, వాణిజ్య ప్రాంతాల్లో సాధారణ జీవితాన్ని సులభతరం చేస్తుంది.
Also Read : నెల్లూరులో గ్లాసు పగులుతుందా? అజయ్ కుమార్ తీరుపై జన సైనికుల మండిపాటు
హైడ్రా చేప్టటిన పనులపై స్థానిక ప్రజలు సంతోషం
ఈ విజయవంతమైన ఆపరేషన్‌ను హైదరాబాద్ నగరమంతా అమలు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అమీర్‌పేట్ మాదిరిగా ఇతర ప్రాంతాల్లోనూ డ్రైనేజీ వ్యవస్థలను శుభ్రం చేసి, వరద నివారణకు శాశ్వత పరిష్కారం కల్పించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక హైడ్రా చేపట్టిన పనులపై అమీర్ పేట్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అధికారులకు ధన్యవాదాలుత తెలిపారు.
అమీర్‌పేట ముంపునకు హైడ్రా పరిష్కారం
మొత్తం 6 పైపులైన్లు ఉండగా.. 3 లైన్లకు పూర్తి స్థాయిలో పునరుద్ధణ పనులు పూర్తి
వర్షం పడితే నీరు నిలవకుండా ముందుకు సాగేలా హైడ్రా చర్యలు
నాలాల డీసిల్టింగ్ పనులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
నగరవ్యాప్తంగా ఇదే విధానం… pic.twitter.com/GaJ8rHZrOd
— BIG TV Breaking News (@bigtvtelugu) October 17, 2025