దీపావళి, ధంతేరాస్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు ఊపందుకోబోతున్నాయి. తులం బంగారం సుమారు రూ. 1,35,000 పలుకుతున్నప్పటికీ అమ్మకాలు ఏమాత్రం తగ్గడం లేదు. దీపావళి, ధంతేరాస్ వేళ బంగారం కొనుగోలు చేయడం వల్ల కుటుంబ శ్రేయస్సుతో పాటు అదృష్టాన్ని పొందే అవకాశం ఉందని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్ ఫైనాన్స్ ప్లాట్ ఫారమ్ లు పురాతన సంప్రదాయాన్ని ఆధునికంగా మార్చుతున్నాయి. అందులో భాగంగానే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జియో గోల్డ్ 24K డేస్ ను ప్రకటించింది. అంతేకాదు, తమ ప్లాట్ ఫారమ్ ద్వారా బంగారం కొనుగోళ్లు చేసే వారికి క్రేజీ ఆఫర్లు అందిస్తోంది.
జియో ఫైనాన్స్, మై జియో యాప్ ల జరిపే డిజిటల్ బంగారం కొనుగోళ్లపై అద్భుతమైన రివార్డులు, బహుమతులను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 18 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారులు స్టోర్‌లలో సాంప్రదాయ శుభ ముహూర్తం కోసం వేచి ఉండకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా 24K స్వచ్ఛమైన బంగారాన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ కాలంలో రూ. 2,000, అంతకంటే ఎక్కువ విలువైన డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే కస్టమర్లకు 2 శాతం బంగారం ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ 72 గంటల్లోపు వారి బంగారు వాలెట్ లో జమ అవుతుందని ప్రకటించింది.
అటు రూ. 20,000, అంతకంటే ఎక్కువ విలువైన బంగారాన్ని కొనుగోలు చేసే వినియోగదారులు ఆటోమేటిక్ గా జియో గోల్డ్ మెగా ప్రైజ్ డ్రాకు క్వాలిఫై అవుతారు. ఇందులో మొత్తం రూ. 10 లక్షల విలువైన బహుమతులు ఉంటాయి. రివార్డులలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, బంగారు నాణేలు, మిక్సర్ గ్రైండర్లు, షాపింగ్ వోచర్లు ఉంటాయి. విజేతలను డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. అక్టోబర్ 27న ఇమెయిల్, SMS నోటిఫికేషన్‌ల ద్వారా విజేతలకు సమాచారం అందిస్తారు. జియోఫైనాన్స్ పండుగ ప్రచారం సాంప్రదాయ బులియన్‌కు అనుకూలమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయంగా డిజిటల్ బంగారానికి పెరుగుతున్న ప్రజాదరణను నొక్కి చెబుతుంది. కొనుగోలుదారులు రూ. 10 నుంచి పెట్టుపెట్టుకోవచ్చు. ఈ ప్లాట్ ఫామ్ ఎండ్ టు ఎండ్ డిజిటల్ సేవలను అందిస్తుంది. కొనుగోలు, నిల్వ నుంచి రిలీజ్ వరకు 24K బంగారు స్వచ్ఛత, ఇన్సూరెన్స్ చేయబడిన భద్రతను నిర్ధారిస్తుంది.
అటు డిజిటల్ చెల్లింపుల దిగ్గజం PhonePe కూడా బంగారం రష్ లోకి చేరింది. ఈ యాప్ ద్వారా రూ.2,000, అంతకంటే ఎక్కువ విలువైన 24K డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసే వినియోగదారులకు 2శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఒక రోజు ఆఫర్ అక్టోబర్ 18న ఉదయం 12:00 గంటల నుంచి రాత్రి 11:59 గంటల మధ్య అందుబాటులో ఉంటుంది. ప్రతి వినియోగదారుడు ఒకసారి మాత్రమే ఈ ఆఫర్ పొందే అవకాశం ఉంటుంది. మొత్తంగా జియో ఫైనాన్స్, ఫోన్ పే పండుగ బహుమతులను అందిస్తున్నందున, ఈ ధన్‌తేరాస్ డిజిటల్ బంగారు రష్ గా మారనుంది. సంప్రదాయం సాంకేతికత పండుగను మరింత క్రేజీగా మార్చబోతోంది.
Read Also: జియో దీపావళి ఆఫర్, జస్ట్ రూ. 199కే అన్ లిమిటెడ్ కాల్స్, 5G డేటా, ఎన్ని రోజులంటే?