BigTV English

BJP : బండి అరెస్ట్ పై బీజేపీ నేతలు ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..

BJP : బండి అరెస్ట్ పై బీజేపీ నేతలు ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..

BJP : బండి సంజయ్ అరెస్ట్ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ అరెస్ట్ ను బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ ఖండించారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న పడవ అని విమర్శించారు. అవినీతి ఆరోపణలతో కూరుకుపోయిన… రాష్ట్ర ప్రభుత్వం… బీజేపీ రాష్ట్ర అధ్యకుడిని అక్రమంగా అరెస్ట్ చేసిందని ట్వీట్ చేశారు. కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ..బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరిని తప్పుపట్టారు. కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు.


బండి సంజయ్‌ అరెస్ట్‌ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఒక ఎంపీని కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి.. బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని ఈటల ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌కు కాలం చెల్లిందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ అన్నారు. ప్రజలు త్వరలో ఆ పార్టీని బొందపెడతారంటూ కామెంట్ చేశారు. పార్లమెంట్‌ సభ్యుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్యగా డీకే అరుణ పేర్కొన్నారు.


బీఆర్‌ఎస్‌ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని బీజేపీ నేత గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంపై ఉన్న పేపర్ లీకేజీ ఆరోపణలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా నిరసిస్తూ కరీంనగర్ లో అర్ధరాత్రి బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్లపైకి వచ్చిన కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలంటూ రోడ్డుపై బైటాయించారు. కేసీఆర్ , బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చింది. మరోవైపు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పీఎస్ ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది. ఈ స్టేషన్ లోనే బండి సంజయ్ ను ఉంచారు. దీంతో అక్కడకు భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×