Big Stories

CBI Inquiry : సీబీఐతో విచారణ జరిపించండి: ఈసీకి బీజేపీ వినతి

CBI Inquiry :టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేపులు బయటకు రావడంతో తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేతలు. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మీడియా వ్యవహారాల ఇన్ ఛార్జ్ అనిల్ బలూనీ, ఓం పాఠక్ బృందం ఈసీని కలిసింది. బీజేపీ పరువును దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆడియో క్లిప్పులను సోషల్ మీడియాలో విడుదల చేసి టీఆర్ఎస్ ఉపఎన్నికలో లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

ఈసీతో భేటీ ముగిసిన తర్వాత బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడులో టీఆర్ఎస్ కు ఓటమి ఖాయమని స్పష్ట చేశారు. అందువల్లే తప్పుడు మార్గాన్ని ఎంచుకుందని ఆరోపించారు. ఆడియో టేపులతో ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తోందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఉన్న వ్యక్తులతో బీజేపీకి సంబంధలేదని స్పష్టం చేశారు. ఆడియో టేపుల్లో బీఎల్ సంతోష పేరు చెప్పినంత మాత్రానా బీజేపీ వెనుక ఉన్నట్లు కాదని తేల్చిచెప్పారు. ఏది ఏమైనా 2023 ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు విేశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

మరోవైపు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై విచారణ చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తెరపైకి వచ్చి రూ. 100 కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో తేల్చాలని ఈడీ కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఈడీ సమగ్ర విచారణ చేపట్టాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారని ఆరోపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News