BigTV English

Hyderabad BMW Car burning: జూబ్లీహిల్స్‌లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్గం, అసలేమైంది?

Hyderabad BMW Car burning: జూబ్లీహిల్స్‌లో నడిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్గం, అసలేమైంది?

Hyderabad BMW Car burning: ఈ మధ్యకాలంలో కార్లు ఎక్కడపడితే అక్కడ తగలబడుతున్నాయి. మేకింగ్ సమస్యా, లేక డ్రైవర్ నిర్లక్ష్యమా? ఏమోగానీ ఆయా కంపెనీలు మాత్రం వాటిపై దృష్టి పెట్టాయి. ఒకప్పుడు చిన్న చిన్న కంపెనీల వాహనాలు తగలబడేవి. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువైంది.


చాలా వాహనాలను రీకాల్ చేశాయి సంబంధిత కంపెనీలు. గత పక్షం రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చల్లగా ఉండడమేకాదు.. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అయితే సరే వాహనాలు తగలబడడంతో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నడ్డిరోడ్డుపై బీఎండబ్ల్యూ కారు దగ్దమైంది. ఆ సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఇంతకీ వాహనం ఎవరిది? ఏం జరిగింది? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామంది వెంటాడుతున్నాయి.


శనివారం రాత్రి 10 గంటలు దాటింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 కూడలి మీదుగా ఫిల్మ్‌నగర్ వైపు బీఎండబ్ల్యూ కారు వెళ్తోంది. మరి ఏం జరిగిందో తెలీదుగానీ ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అలర్టయిన వ్యక్తులు కారు నుంచి బయటదిగి కొంతదూరం పరుగులుపెట్టారు. చివరకు ప్రాణాలు కాపాడుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న వెంటనే జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఆ కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ముఖ్యంగా మెయిన్ రోడ్డుపై ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇంతవరకు బాగానే ఉంది. అసలు వాతావరణం చల్లగా ఉంది.

ALSO READ:  కేసీఆర్ సార్.. మర్చిపోయారా? ఇప్పుడు మీరు సీఎం కాదు

అయినా కారులో ఎలా మంటలు వచ్చాయన్నది అసలు పాయింట్? అందులోనూ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన బీఎండబ్ల్యూ కారు దగ్దమైన ఘటనలు పెద్దగా లేవని అంటున్నారు అక్కడి ప్రజలు. ప్లాన్ ప్రకారమే కారు తగలబడిందా? ఈ ఘటన వెనుక ఎవరైనా ఉన్నారా? వంటి ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. దీనిపై పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.

 

 

Related News

Pocharam Dam: డేంజర్‌లో పోచారం డ్యామ్.. 10 ఊర్లు ఖతమ్..!

Local Body Elections: పంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

Kamareddy floods: తెలంగాణలో వర్ష బీభత్సం.. నీట మునిగిన కామారెడ్డి పట్టణం, రెసిడెన్షియల్ విద్యార్థులు సేఫ్

Schools holiday: ఆ జిల్లాలలో రేపు పాఠశాలలకు సెలవు.. బయటికి రావద్దంటూ హెచ్చరిక!

Hyderabad fire accident: హైదరాబాద్‌లో మళ్లీ అగ్ని అలజడి.. పెట్రోల్ బంక్‌లో మంటలు.. ఆ తర్వాత?

Aghapur Ganesh: గణపయ్య ఈసారి సీఎం రేవంత్ లుక్‌లో.. అఘాపూర్‌లో అలరించే విగ్రహం!

Big Stories

×