Bollaram Army Weapons Theft: హైదరాబాద్‌లోని బొల్లారం ఆర్మీ బెటాలియన్ ప్రాంతంలో ఆయుధాలు చోరీ అయ్యాయన్న వార్త తీవ్ర దుమారం రేపుతుంది.అయితే తాజాగా ఆయుధాలని చోరీ చేసిన దొంగలని పోలీసులు పటుకున్నట్టు తెలుస్తుంది.
అవును..ఆయుధాల గది నుండి తుపాకులు, పిస్టల్స్,మందుగుండు మిస్ అయిన ఈ కేసులో ఒక మాజీ ఆర్మీ ఉద్యోగిని బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం జంగం రెడ్డిపల్లికి చెందిన ఉప్పుతోళ్ల మల్లేష్ (37 )ఈ చోరీ చేశాడని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఇక అరెస్ట్ తర్వాత కోర్ట్ లో హాజరు పరచగా కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
సుమారు 16 ఏళ్ల పాటు హవల్దార్
పోలీసులు బయటపెట్టిన వివరాల ప్రకారం, మల్లేష్ 2010లో భారత సైన్యంలో చేరి, సుమారు 16 ఏళ్ల పాటు హవల్దార్‌గా పని చేశాడు. ఇక ఈ సంవత్సరం జూన్ 30న అతడు తన సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే తను చాలా ముందుగా రిటైర్ అయ్యాయన్న ఆవేదనతోనే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
గత నెల 30, 31 లలో రాత్రి సుమారు 11 గంటల సమయంలో మల్లేష్ బొల్లారంలోని 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ లోకి వెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అక్కడి ‘కోటే రూమ్’, ‘మ్యాగజైన్ రూమ్’ తాళాలు పగలగొట్టి నాలుగు AK-203 రైఫిళ్లు, ఒక INSAS 1B1 రైఫిల్, ఆరు 9mm ఆటోమేటిక్ పిస్టల్స్, ఒక సివిలియన్ పిస్టల్, నైట్ విజన్ బైనాక్యులర్‌తో పాటు 1,900కు పైగా రౌండ్ల మందుగుండు సామగ్రిని దొంగిలించాడు.
ఇక ఆగస్టు 31న డ్యూటీలోకి వచ్చిన వారు తాళాలు విరగొట్టి ఉండటం చూశారు.లోపల ఆయుధాలు మాయమవ్వడాన్ని చూసి పై అధికారులకు సమాచారం అందించారు.
మొత్తం 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు
ఇక భారీ ఎత్తున రక్షణ ఉండే బెటాలియన్ నుండి చాలా పెద్ద మొత్తంలో వెపన్స్ మాయం అవడంతో దేశ భద్రతా సంస్థలు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాయి.ఇక ఈ ఆయుధాలు ఉగ్రవాదుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉందనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు.
మిలిటరీ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మిలిటరీ పోలీస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) వంటి సంస్థలు ఈ సంఘటనని నిశితంగా పరిశీలించగా NIA తెలంగాణ పోలీసులకు, ఆర్మీకి సహకారం అందించింది.హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్, మల్కాజిగిరి కమిషనరేట్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, బొల్లారం పోలీసులు కలిసి మొత్తం 12 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.
దాదాపు 800 మంది సిబ్బంది
ఇక ఈ దర్యాప్తులో పోలీసులు మొదటి నుంచీ ఈ చోరీ లోపలి వ్యక్తులు ఎవరైనా చేసి ఉంటారా అన్న కోణంపైనే ఫోకస్ పెట్టారు. బెటాలియన్ మొత్తంలో దాదాపు 800 మంది సిబ్బంది ఉంటారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉండే గదులు 50 మీటర్ల దూరంలోనే ఉంటాయి. దర్యాప్తు చేస్తున్న క్రమంలో ప్రతిరోజూ అక్కడ సిసిటీవీ కెమెరాలను కొంతసేపు ఆఫ్ చేస్తున్నట్లు గుర్తించారు.అలా అనుమానితులను విచారిస్తూ దొరికిన ఆధారాలతో పోలీసులు మల్లేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు స్వాధీనం
మల్లేష్ ఇచ్చిన సమాచారంతో చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారులోని కౌకూర్, యాప్రాల్ ప్రాంతాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి, నిందితుడి నివాసం నుంచి వెపన్స్ ని రికవరీ చేశారు.
ఇక ఈ కేసులో ముగ్గురు సర్వింగ్ ఆర్మీ అధికారులను అరెస్ట్ చేశారంటూ వచ్చిన వార్తలని ఇండియన్ మిలిటరీ ఖండించింది. అవన్నీ కేవలం రూమర్స్ అని తేల్చి చెప్పింది.ఇక . ప్రస్తుతం బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .