Mulugu Farmers: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాజేడు మండలం పేరూరు గ్రామంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులకు అనుకోకుండా ఎలక్ట్రిక్ షాక్ తగలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
బావి వద్ద కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదం
పేరూరు పరిధిలోని పొలాల్లో వ్యవసాయ బావికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు ముగ్గురు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపం వల్ల వారిపై ఒక్కసారిగా కరెంట్ ప్రసారమై తీవ్ర షాక్‌కు గురయ్యారు. వెంటనే గమనించిన తోటి రైతులు అప్రమత్తమై, వారిని అత్యవసరంగా ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఇద్దరు మృతి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుమ్మ అభిషేక్ (29), కంది సమ్మయ్య (50) తీవ్ర గాయాల కారణంగా కన్నుమూశారు. మరో రైతు నరేష్‌కు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
చేతికి అందివచ్చిన పంటను కాపాడుకునేందుకు కష్టపడుతున్న సమయంలో ఈ విషాదం జరగడంతో పేరూరు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Also Read: డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!