22A Lands: తెలంగాణ భవన్‌లో 22ఏ భూ బాధితులతో కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలది.. అంతులేని దోపిడీ అని విమర్శించారు. 22A భూముల అంశంపై.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారారని విమర్శించారు. ఒక్క కలం పోటుతో ఊళ్లకు ఊళ్లను 22ఏలో పెట్టిస్తున్నారని హరీశ్ ఆరోపించారు. 22Aపై నిలదీస్తామనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. అయినా పోరాటం కంటిన్యూ చేస్తామని స్పష్టం చేశారు హరీష్ రావు.
22A మహా కుంభకోణం: కేటీఆర్
22A మహా కుంభకోణమని ఆరోపించారు కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలు మాత్రమే 22A జాబితాలో ఉన్నాయని.. ఇప్పుడు కోటి 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్లాయని చెప్పారు.
బీఆర్ఎస్ పై ఆది శ్రీనివాస్ విమర్శలు..
22Aపై బీఆర్ఎస్ అసత్య ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. నిషేధిత జాబితాలో అత్యధికంగా భూమిని చేర్చింది గత ప్రభుత్వమేనని చెబుతున్నారు. ధరణిని అడ్డుపెట్టుకుని వందల ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు. 22Aతో అవన్నీ బయటపడుతాయనే భయంతోనే బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తోందన్నారు.
దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి..
ధరణిలో వేలిముద్ర లేకుండా ఇంచు భూమి కూడా అటూ ఇటూ కాదన్నారు కేటీఆర్. భూభారతిలో భూముల గోల్‌మాల్ జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
Also Read: 5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!