OSD Sumanth Father: మాజీ మంత్రి కొండా సురేఖ వద్ద గతంలో ఓఎస్డీగా పని చేసిన సుమంత్ తండ్రి నారా సుబ్రమణ్యేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
కొండా సురేఖ మంత్రిగా ఉన్న సమయంలో సుమంత్ ఆమె వద్ద ఓఎస్డీగా పనిచేసిన విషయం తెలిసిందే. పలు వివాదాల్లో అతని పేరు బయటకు రావటంతో ప్రభుత్వం అతన్ని విధుల్లో నుంచి తప్పించింది. రూ.10 కోట్లు డిమాండ్ చేసి ఇవ్వలేదన్న కోపంతో సుమంత్ తన సహచరులతో కలిసి రియల్టర్ అయిన హరికృష్ణపై ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేశాడన్న నేరారోపణలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఇటీవల సుమంత్ కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇటువంటి పరిస్థితుల్లోనే అతని తండ్రి సుబ్రమణ్యేశ్వర రావు గురువారం రాత్రి హన్మకొండలోని తన నివాసంలో పెద్ద సంఖ్యలో నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు సమాచారం. శుక్రవారం ఉదయం ఆయన అపస్మారక స్థితిలో ఉండటం చూసిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. సుమంత్ పైన గత కొంతకాలంగా వస్తున్న వివాదాలు, కేసులు నమోదు కావటంతో మనస్తాపానికి గురై సుబ్రమణ్యేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా తెలుస్తోంది.
Also Read: గోల్డెన్ అవర్ వృథా.. ఆస్పత్రికి వినియోగదారుల ఫోరం షాక్.. ఏకంగా రూ.43 లక్షల జరిమానా!
మరోవైపు మామ ఆత్మహత్యాయత్నంపై సుమంత్ భార్య డాక్టర్. మనీషా స్పందించారు. తన భర్తను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వీడియో రిలీజ్ చేశారు. రాజకీయ, వ్యక్తిగత కారణాలతోనే సుమంత్ ను తొలగించినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకుపై అక్రమ కేసులు, వేదింపులు భరించలేక మామయ్య సూసైడ్ చేసుకోవాలనుకున్నారని పేర్కొన్నారు. రూ.10 కోట్లు ఇవ్వాలని రియల్టర్ ను బెదిరించినట్లు అబద్దపు ప్రచారా చేస్తున్నారని మనీషా ఆవేదన వ్యక్తం చేశారు. దయజేసి ఇకనైన నిజాలు ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబాన్ని వేధించడం ఆపాలని మనీషా కోరారు. కాగా సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర రావు.. గతంలో విద్యుత్ శాఖలో ఉద్యోగం చేశారు. ఉద్యోగ విరమణకు ఆరు నెలల సమయం ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
Father of Konda Surekha's Former OSD Sumanth Attempts Suicide in Warangal
Nara Subrahmanyeswara Rao, father of Sumanth — former OSD to ex-minister Konda Surekha — allegedly attempted suicide in Warangal, reportedly distressed over the legal troubles affecting his son's career… pic.twitter.com/uiL9HBQqXf
— Digital Prime News (@DigiPrimeNews) September 11, 2026
Also Read: అర్జెంటీనాలో అకస్మాత్తుగా మాయమైన సముద్రం? అసలు కారణం ఇదేనట!