E-Paper
Advertisement

డార్లింగ్ ప్రభాస్‌కే ప్రాంక్ కాల్ చేసిన KTR.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో!

డార్లింగ్ ప్రభాస్‌కే ప్రాంక్ కాల్ చేసిన KTR.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో!
Advertisement

KTR Prabhas: రాజకీయాల హడావుడిని కాసేపు పక్కన పెట్టి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చిన్నారులతో కలిసి సరదాగా సందడి చేశారు. ‘ది అండర్ 18 వరల్డ్’ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన, యంగ్ పాడ్‌కాస్టర్లతో కలిసి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు చేసిన ఒక ప్రాంక్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేటీఆర్ సమయస్ఫూర్తి, ప్రభాస్ రెస్పాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

షాక్ ఇచ్చిన డార్లింగ్ ప్రభాస్!

Advertisement

ఈ పాడ్‌కాస్ట్ సంభాషణలో భాగంగా కేటీఆర్, పిల్లలతో కలిసి ప్రభాస్‌కు ఫోన్ కలపగా ఒక సరదా డ్రామా జరిగింది. కేటీఆర్ డయల్ చేసి, అక్కడ ఉన్న ఒక చిన్నారికి ఫోన్ ఇచ్చారు. ఆ పాప చాలా గంభీరంగా ఫోన్ మాట్లాడి ‘నాకు రోడ్డుపై ఈ ఫోన్ దొరికింది, ఇంతకీ మీరు ఎవరు మాట్లాడుతున్నారు?’ అని ప్రభాస్‌ను ప్రశ్నించింది. అవతలి నుంచి మాట్లాడుతోంది డార్లింగ్ ప్రభాస్ కావడం, అపరిచిత గొంతుతో అలా అడగ్గానే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా నవ్వుతూనే వెంటనే కాల్ కట్ చేశారు. దీంతో కేటీఆర్ సరదాగా తలపట్టుకుని గట్టిగా నవ్వేశారు.

Advertisement

అసలు విషయం చెప్పిన కేటీఆర్

ట్విస్ట్ నచ్చడంతో కేటీఆర్ స్వయంగా మళ్లీ ప్రభాస్‌కు ఫోన్ చేశారు. కాల్ ఎత్తగానే ప్రభాస్‌కి క్షమాపణలు చెబుతూ.. అది తమ పిల్లలు చేసిన సరదా ప్రాంక్ అని వివరించారు. విషయం తెలుసుకున్న ప్రభాస్ కూడా ఎంతో సరదాగా నవ్వుతూ మాట్లాడారు. రాజకీయ నాయకులకు, సినిమాలకు ఉండే బిజీ లైఫ్‌లో ఇలాంటి సరదా ఘట్టాలు అరుదుగా చూస్తామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Also Read: 22A మహా కుంభకోణం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీశ్‌రావు తీవ్ర విమర్శలు!

Tags

Related News

మోదీ పేరుకే బీసీ.. కులగణన చేయడానికి భయమెందుకు? అసెంబ్లీలో సీతక్క ప్రశ్న

22A మహా కుంభకోణం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్, హరీశ్‌రావు తీవ్ర విమర్శలు!

బీఆర్ఎస్‌పై ఫ్లాష్ సర్వేలో ఏం తేలింది?.. సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

2027 జనగణనలో బీసీ లెక్కలు ఏవి? కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్!

PM విశ్వకర్మ నుండి UPI వరకు.. మోదీ 25 ఏళ్ల పాలనపై బీజేపీ మాస్టర్ ప్లాన్!

యువతీయువకుడి వీరంగం.. బంజారాహిల్స్‌లో కారుతో బీభత్సం, పోలీసుల అదుపులో

ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో దారుణం.. కత్తులతో దాడి చేసి చంపేసి, సీసీటీవీ సాక్షిగా..

Big Stories

Advertisement
×