Bomb Threat: హైదరాబాద్‌లో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో మంగళవారం తీవ్ర కలకలం రేగింది. కోర్టులో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టును వెంటనే ఖాళీ చేయించి, తనిఖీలకు అనుమతినిచ్చారు. తర్వాత కోర్టు ప్రాంగణంలోని అన్ని కోర్టులను మూసివేసి, అక్కడ ఉన్న న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కేసుల కోసం వచ్చిన ప్రజలను వెంటనే బయటకు పంపించారు.
నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు హెచ్చరిక..
వివరాల ప్రకారం.. సిటీ సివిల్ కోర్టుకు బాంబు పెట్టినట్టు అబీదా అబ్దుల్లా పేరుతో వార్నింగ్ మెయిల్ వచ్చింది. బెదిరింపు మెయిల్ పంపిన ఆగంతకుడు. నాలుగు ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్టు మెయిల్ పంపించాడు. సిటీ సివిల్ కోర్టుతో పాటుగా నాలుగు చోట్ల బాంబులు పెట్టినట్లు హెచ్చరిక జారీ చేశారు. సిటీ సివిల్ కోర్టు, జడ్జి చాంబర్స్, జింఖానా క్లబ్, జడ్జి క్వార్టర్స్‌లో బాంబులు అమర్చినట్లు మెయిల్ ఇచ్చారు.
రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్
కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపోతుందంటూ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో అతడి మెయిల్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నాలుగు చోట్ల బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా రాజ్ భవన్‌లో కూడా బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు. గవర్నర్ రాజ్ భవన్‌లో ఉన్న సమయంలో బాంబు మెయిల్ రావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Also Read: గొడ్డలితో భర్తను నరికి నరికి చంపిన ఇద్దరు భార్యలు
ఇలాంటి భద్రతా బెదిరింపులతో పెరుగుతున్న నేపథ్యంలో, భవిష్యత్‌లో కోర్టుల భద్రతపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయంలో, కోర్టుల వంటి ముఖ్యమైన స్టానాలకు ప్రత్యేక భద్రతా ప్రణాళికలు రూపొందించాలి, అత్యాధునిక భద్రత పరికరాలతో తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి, సిటీ సివిల్ కోర్టు పరిసరాల్లో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది.