Fish Venkat -Vishwak: టాలీవుడ్ సినీ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త మెరుగుపడిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ కనీసం ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉండిపోయారు. కానీ ప్రస్తుతం మాత్రం ఈయన అందరితో మాట్లాడుతున్నారు, అందరిని గుర్తు పడుతున్నారు. ఇలా గత వారం రోజులుగా హాస్పిటల్ లో ఉంటూ సరైన చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఈయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందని తెలుస్తోంది. ఇకపోతే ఈయన రెండు కిడ్నీలు పూర్తిగా పాడవడంతో డయాలసిస్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటే వెంటనే ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉంటుంది.
స్పందించని టాలీవుడ్ పెద్దలు…
ఇలా కిడ్నీ మార్పిడి చేయాలి అంటే ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి తమకు ఎవరైనా సహాయం చేయాలి అంటూ ఫిష్ వెంకట్ కుమార్తె, అతని భార్య సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మీడియా సమావేశంలో కూడా సహాయం కావాలని కోరడంతో తెలంగాణ సర్కార్ స్పందిస్తూ అండగా ఉంటామని అభయమిచ్చారు. ఇప్పటివరకు టాలీవుడ్ (Tollywood)ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్కరు కూడా స్పందించక పోవడం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. చివరికి ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్య నుంచి బయటపడి మీడియాతో మాట్లాడిన ఒక్క తెలుగు హీరో కూడా ముందుకు రావడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
అండగా నిలిచిన విశ్వక్..
ప్రస్తుతం టాలీవుడ్ హీరోల గురించి ఇలాంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ ఘటనపై స్పందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణించిందని తెలుసుకున్న వెంటనే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ తన కుటుంబ సభ్యులకు చెక్ అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ విషయం వైరల్ గా మారడంతో విశ్వక్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే మరికొందరు విమర్శిస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత టాలీవుడ్ స్పందించడం ఏంటీ? టాలీవుడ్ ఇప్పుడు మేల్కొందా? అంటూ విమర్శిస్తున్నారు.
చిన్న హీరో..గొప్ప మనసు..
ఫిష్ వెంకట్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు అందరి సినిమాలలో నటించారు. అయితే ఇప్పటివరకు స్టార్ హీరోలు ఎవరు స్పందించక పోయిన విశ్వక్ ఈయన విషయంలో ముందుగా స్పందిస్తూ రెండు లక్షల సహాయం చేయడంపై ఈయన మంచి మనసు పట్ల విశ్వక్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈయన మాదిరిగానే మరి కొంతమంది ముందుకు వచ్చి ఫిష్ వెంకట్ ను కాపాడాలని అభిమానులు, అలాగే కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే మరొక రెండు మూడు రోజులలో డిస్చార్జ్ చేసే అవకాశాలు ఉంటాయని కూడా వైద్యులు వెల్లడించారు.
Also Read: Fish Venkat Emotional:బతికించండయ్యా.. కన్నీళ్లు పెట్టుకున్న ఫిష్ వెంకట్, టాలీవుడ్ మనసు కరిగేనా?