E-Paper
Advertisement

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!
Advertisement

Stubble Burning: స్వేచ్చ బ్యూరో: కొందరు రైతుల బాధ్యతారాహిత్యం తోటి రైతుకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. పొలాల్లో వరికొయ్యలను తగులబెట్టవద్దని అధికారులు నెత్తీనోరూ బాదుకుంటున్నా, కొందరి నిర్లక్ష్యం వల్ల ఒక రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోట పూర్తిగా బూడిదైన విషాద ఘటన హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ఎగసిపడిన అగ్నికీలలు.. 45 ఆయిల్ పామ్ చెట్లు దహనం

వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కన్నబోయిన మహేందర్ అనే రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోట పక్కన.. కొందరు రైతులు పంట కోతల అనంతరం మిగిలిన వరికొయ్యలను తగులబెట్టారు. ఎండ తీవ్రత, ఈదురుగాలుల వల్ల ఆ మంటలు వేగంగా మహేందర్ తోటకు వ్యాపించాయి. రాత్రి వరకు మంటలు ఎగసిపడటంతో దాదాపు 45 ఆయిల్ పామ్ చెట్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో మిగిలిన తోట తృటిలో తప్పించుకుందని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.

Advertisement

Also read; ‘తెలంగాణ సెంటిమెంట్.. ఒక ఫ్యాషన్ అయ్యింది’.. బీఆర్ఎస్‌పై రఘునందన్ రావు ఫైర్

అధికారుల హెచ్చరికలు పెడచెవిన పెట్టడమే కారణం..

వరికొయ్యలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా, ఇలాంటి పెను ప్రమాదాలు జరుగుతాయని వ్యవసాయ శాఖ ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు రైతులు పాత పద్ధతులనే అవలంబిస్తున్నారు. గతంలోనూ ఇక్కడ వరికొయ్యల మంటల వల్ల గడ్డివాములు, విద్యుత్ మోటార్లు కాలిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా రైతులు ఈ ప్రమాదకర అలవాటును మానుకోకపోతే చట్టపరమైన చర్యలతో పాటు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Also Read; కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×