E-Paper
Advertisement

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!
Advertisement

Palamuru: స్వేచ్చ బ్యూరో: ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జూన్ 4, 5 తేదీల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. పలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లను పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు.

ఏర్పాట్ల ప‌రిశీలన..

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో నేపథ్యంలో జ‌డ్చ‌ర్లలోని క‌ల్వ‌కుర్తి ఎక్స్ రోడ్ వ‌ద్ద‌ హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను ప్ర‌భుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి, జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో క‌లిసి ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు పరిశీలించారు. గంగాపూర్ ఏరియా ఆసుప‌త్రి వ‌ద్ద బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.

జన సమీకరణపై స‌న్న‌హాక స‌మావేశం

Advertisement

అనంత‌రం సీయం స‌భ‌కు జ‌న‌సమీక‌ర‌ణ‌పై మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా కేంద్రంలో ప్ర‌జా ప్ర‌తినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌తో స‌న్న‌హాక స‌మావేశం నిర్వ‌హించారు. జనసమీకరణను నాయకులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అందరి లక్ష్యం సీయం సభను విజయవంతం చేయడమేనని స్పష్టం చేశారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఎమ్మెల్యేలు బాధ్య‌త‌లు తీసుకుని పార్టీ శ్రేణుల‌ స‌మ‌న్వ‌యంతో సీయం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. సీయం రేవంత్ రెడ్డి పర్యటనలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పర్యాటక, సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాటికి శ్రీహరి, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి త‌దిత‌రులు పాల్గొంటారు.

Also Read: పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల బదిలీల్లో అక్రమాలు.. సస్పెన్షన్‌లో ఉన్న అధికారులకు పోస్టింగులు

ముఖ్య‌మంత్రి ప‌ర్యట‌న సాగ‌నుందిలా…!

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్), భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల ప‌నుల పురోగ‌తిని అధికారుల వివ‌రిస్తారు. త‌ర్వాత మధ్యాహ్నం 3.40 – నుంచి 4 గంట‌ల వ‌ర‌కు మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4.10 గంట‌ల‌కు మ‌క్త‌ల్ హెలిప్యాడ్ కు చేరుకుంటారు
అనంతరం సాయంత్రం 4.10 గంట‌ల‌కు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు, కృష్ణా-భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యామ్ ప్రాంతాన్ని ఏరియ‌ల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు.

సాయంత్రం 6.45 గంటల నుంచి..

సాయంత్రం 4.50 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా ధారూర్ మండలం గూడెందొడ్డి హెలిప్యాడ్‌కు చేరుకుని స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 4.55 గంటల నుంచి 5.30 గంటల వరకు గూడెందొడ్డి రిజర్వాయర్, జేఎన్‌ఎల్‌ఐఎస్ స్టేజ్-1 పంప్‌హౌస్‌ను పరిశీలిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు సోమశిల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 6.45 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకు మృగవాణి రిసార్ట్ రివర్‌ఫ్రంట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జూన్ 5న ఉదయం 9.45 గంటలకు కొల్లాపూర్‌లోని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంలో బ్రేక్ ఫాస్ట్. అనంతరం ఉదయం 10.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్‌హౌస్‌కు చేరుకుంటారు.

Also Read: ‘తెలంగాణ సెంటిమెంట్.. ఒక ఫ్యాషన్ అయ్యింది’.. బీఆర్ఎస్‌పై రఘునందన్ రావు ఫైర్

పంప్‌హౌస్ పనులు..

ఉదయం 10.40 గంటల నుంచి 11.40 గంటల వరకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐఎస్) ప్యాకేజీ-3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ-2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ-1 డెలివరీ సిస్టర్న్, ఎంజీకేఎల్‌ఐఎస్ లిఫ్ట్-1 పంప్‌హౌస్‌లను పరిశీలిస్తారు. ఉదయం 11.50 గంటలకు నార్లాపూర్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ-3 కాలువ పనులు, ఏదుల రిజర్వాయర్, పంప్‌హౌస్ పనులను ఏరియ‌ల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.20 గంటలకు కుమ్మెర హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు పీఆర్‌ఎల్‌ఐఎస్ ప్యాకేజీ-8 స్టేజ్-3 పంప్‌హౌస్, వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించిన ప్యాకేజీ – 9, 10, 11 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

బహిరంగ సభలో..

అనంతరం మధ్యాహ్నం 2.10 గంటల నుంచి 2.30 గంటల వరకు పీఆర్‌ఎల్‌ఐఎస్‌కు చెందిన కరివేన రిజర్వాయర్ ప్యాకేజీ- 14, 15 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు జడ్చర్ల మండలం ఉదండాపూర్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.10 గంటల నుంచి 5.40 గంటల వరకు పీఆర్‌ఎల్‌ఐఎస్‌కు చెందిన ఉదండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీలు 17, 18 పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఉదండాపూర్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.

Also Read: రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×