BigTV English

Steel Bridge in Hyderabad: స్టీల్ ఫ్లైఓవర్‌కు బీఆర్ఎస్ లీడర్ పేరు.. ప్రకటించిన కేటీఆర్..

Steel Bridge in Hyderabad: స్టీల్ ఫ్లైఓవర్‌కు బీఆర్ఎస్ లీడర్ పేరు.. ప్రకటించిన కేటీఆర్..
steel bridge

BRS leader name to steel bridge(Hyderabad latest news):

హైదరాబాద్ మధ్యలో ఉన్న ఫ్లైఓవర్. కీలకమైన జంక్షన్లో నిర్మించిన స్పెషల్ వంతెన. సిమెంట్, ఐరన్‌తో పిల్లర్లు వేసి.. పైనా కాంక్రీట్‌తో వేసిన వంతెన కాదది. పూర్తిగా స్టీల్‌తో ఫిక్స్ చేశారు. అదికూడా మెట్రో ట్రాక్ పైనుంచి వేశారు. అందుకే అది సౌత్ ఇండియాలోనే పొడవైన ఉక్కు వంతెనగా నిలిచింది.


స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో GHMC ఈ వంతెన నిర్మించింది. 2.63 కి.మీ.ల పొడవైన బిడ్జి కోసం 450 కోట్లు ఖర్చు చేశారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి వీఎస్టీ జంక్షన్ వరకు ఉంటుందీ ఫ్లైఓవర్. 81 స్టీల్ పిల్లర్లు, 426 స్టీల్ దూలాలు.. మొత్తంగా 12,316 మెట్రిక్ టన్నుల ఉక్కుతో.. పక్కాగా ఫిక్స్ చేశారు. ఆగస్టు 19న వంతెన ఓపెనింగ్.

ప్రత్యేకంగా నిర్మించిన ఈ స్టీల్ ఫ్లైఓవర్‌కు మాజీ మంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టింది ప్రభుత్వం. నాయిని.. వీఎస్టీ కార్మిక సంఘానికి సుదీర్ఘకాలం సారథ్యం వహించారు. ప్రముఖ కార్మిక నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. ఆయన ఇలాఖాలోనే ఈ వంతెన ఉండటంతో.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ స్టీల్ ఫ్లైఓవర్‌ను నాయిని నర్సింహారెడ్డి పేరును ఖరారు చేసింది సర్కారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×