BigTV English

BRS MLAs Protested in Assembly: కాంగ్రెస్‌ వైఖరిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆగ్రహం.. శాసనసభ ప్రాంగణంలో నిరసన..

BRS MLAs Protested in Assembly: కాంగ్రెస్‌ వైఖరిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆగ్రహం.. శాసనసభ ప్రాంగణంలో నిరసన..
BRS leaders Protested in Assembly

BRS leaders Protested in Assembly(Latest political news Telangana): తెలంగాణ శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. కేసీఆర్ నల్గొం సభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బాష పైన బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు.


అనంతరం మీడియా పాయింట్‌ వద్దకు వెళ్తుండగా పోలీసులు, మార్షల్స్‌ వారిని అడ్డుకోవడంతో భారాస ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసి.. వారితో వాగ్వాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్‌ వద్దకు అనుమతులు ఉండవని పోలీసులు చెప్పగా.. ఆ ఉత్తర్వులు చూపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్‌ చేశారు.

Read More: నేడు కోదండరామ్ ఎమ్మెల్సీ ఎన్నికపై హైకోర్టులో విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..


సభలో మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పాయింట్‌ వద్ద వెళ్లే అవకాశం లేదా? అని వారు ప్రశ్నించారు. బారికేడ్లు అడ్డుగా పెట్టడంతో అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేల గొంతు నొక్కి.. ఎమ్మెల్యేలపై ఆంక్షలు ఎందుకని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇక్కడ ఎందుకు 3-4వేల మంది పోలీసులను మోహరించారని ఆరోపించారు. మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడేందుకు అనుమతి ఇస్తారా లేద కంచెలు బద్దలు కొట్టాలా? అని పాడి కౌశిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×