E-Paper
Advertisement

BRS: కేటీఆర్ ముందే గొడవ.. బీఆర్ఎస్ నేతల రచ్చ రచ్చ..

BRS: కేటీఆర్ ముందే గొడవ.. బీఆర్ఎస్ నేతల రచ్చ రచ్చ..
Advertisement

BRS: ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ వచ్చారు. పార్టీ నాయకులంతా హాజరయ్యారు. ఒకటే హడావుడి. ఎల్బీ నగర్ రూపురేఖలు మార్చేశామంటూ మంత్రి కేటీఆర్.. ఓ రేంజ్‌లో చెప్పుకొస్తున్నారు. సడెన్‌గా అలజడి. ఏం జరుగుతోందని అంతా ఉలిక్కిపడి చూశారు. పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఎల్బి నగర్‌లో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో జరిగిందీ గొడవ. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, చంపాపేట్ మాజీ కార్పొరేటర్ రమణారెడ్డికి మధ్య రగడ మొదలైంది. మంత్రి వేదికపై ఉండగానే తోపులాటకు దారితీసింది. దీంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

Advertisement

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, చంపాపేట్ మాజీ కార్పొరేటర్ రమణారెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయని స్థానిక కార్యకర్తలు చెప్తున్నారు. మంత్రి కేటీఆర్ రావడాన్ని రమణారెడ్డి తనకు అనుకూలంగా మలుచుకున్నారని, ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే అనుచరుల ఆరోపణ. దీంతో.. అతనిపై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి వాళ్లను అడ్డుకున్నారు. ఇంతలో పరుగు మొదలుపెట్టి వారి బారి నుంచి తప్పించుకెళ్లారు రమణారెడ్డి.

ఆత్మీయ సమ్మేళనాలతో హడావుడి చేస్తున్న గులాబీదళంలో ఈ పరిణామం అలజడి రేపుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన కేటీఆర్ సమక్షంలో ఈ వీధి పోరాటాలు ఏంటని కేడర్ ప్రశ్నిస్తోంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×