Malla Reddy – CM Revanth: తెలంగాణలో మాంచి మాస్ లీడర్ మాజీ మంత్రి మల్లారెడ్డి. ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మలచుకోవడంతో తిరుగులేని వ్యక్తి. ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పించడమే కాదు.. దాన్ని లైట్‌గా తీసుకోవడంలో ఆయనకు మించినవారు మరొకరు లేరంటారు. లేటెస్ట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు మాజీ మంత్రి మల్లారెడ్డి.
మాజీ మంత్రి మల్లారెడ్డి పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. తన మనమరాలి మ్యారేజ్ నిమిత్తం ప్రముఖులను కలిసి పెళ్లి పత్రిక ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను స్వయంగా ఆహ్వానించారాయన. తాజాగా బుధవారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
మల్లారెడ్డితోపాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. తన మనమరాలి పెళ్లికి రావాలని కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు మధ్య చర్చ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. తన మనమరాలి పెళ్లికి పిలిచేందుకు వచ్చానని, అంతే తప్ప ఇతర కారణాలేమీ లేవని తేల్చి చెప్పేశారు మల్లారెడ్డి. రాజకీయాలు వేరు.. రిలేషన్ షిప్ వేరన్నది ఆయన మాట.
ఒక్కసారి వెనక్కి వెళ్తే.. గతంలో రేవంత్‌రెడ్డి-మల్లారెడ్డి టీడీపీలో ఉండేవారు. రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే కాగా, మల్లారెడ్డి (Malla Reddy) ఎంపీగా ఉండేవారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. మల్లారెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లారు. పదేళ్లుపాటు మంత్రిగా కొనసాగారు మల్లారెడ్డి.
ALSO READ: తెలంగాణలో కొత్త టీచర్లకు నియామక పత్రాలు, సీఎం రేవంత్ న్యూరికార్డ్
తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత మల్లారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే కొందరు రాజకీయ నేతలు మాత్రం, గతంలో టీడీపీలో ఉన్న నేతలంతా తొలుత సీఎం చంద్రబాబును కలుస్తున్నారని, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమవుతున్నారనే చర్చ సాగుతోంది.