E-Paper
Advertisement

Nayanatara: నయన్ కొత్త వివాదం… ఆమె పిల్లల ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలా?

Nayanatara: నయన్ కొత్త వివాదం… ఆమె పిల్లల ఖర్చులు కూడా నిర్మాతలే భరించాలా?
Advertisement

Nayanatara : సూపర్ స్టార్ నయనతార వివాదాలలో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. ఆమె సినిమాలతో ఎంత పాపులర్ అయిందో వివాదాలతో కూడా అదే రేంజ్ లో చిక్కుకుంటుంది. 40 కి దగ్గర్లో ఉన్న ఈ  పాన్ ఇండియా బ్యూటీ ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ హీరోయిన్ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. అది కూడా తన పిల్లల కారణంగా. మరి ఆ వివాదం ఏంటో తెలుసుకుందాం పదండి.

పిల్లల భారం నిర్మాతపై…

Advertisement

నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఆ ఇద్దరు పిల్లల ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నయనతార తన ఇద్దరు పిల్లల భారాన్ని కూడా నిర్మాతలపై మోపుతోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో నిర్మాత అండ్ యూట్యూబర్ అంతనన్ నయనతార వ్యవహారంపై స్పందిస్తూ ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘నయనతార తన ఇద్దరు పిల్లలతో షూటింగ్ కి వస్తోంది. అయితే ఆ ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఆయాలను షూటింగ్ లొకేషన్లోకి తీసుకొస్తుంది. పైగా వాళ్లకి నిర్మాతలే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. అసలు ఇదెక్కడి న్యాయం? ఆమె పిల్లల నానీలకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత నిర్మాతలది ఎలా అవుతుంది? ఆమె తన పర్సనల్ విషయాలపై కూడా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తోంది’ అంటూ నయన్ పెళ్లి వీడియోల గురించి కూడా మాట్లాడారు ఈ ప్రొడ్యూసర్. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో నయనతార, విగ్నేష్ శివన్ ల పెళ్లి డాక్యుమెంటరీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దానిపై సదరు నిర్మాత స్పందిస్తూ ‘నయనతార తన పెళ్లిని కూడా నెట్ ఫిక్స్ కి భారీ మొత్తానికి అమ్మేసింది. ఇలా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతిదాన్ని వ్యాపారంగా మార్చుకుంటుంది’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇదే నిర్మాత నయనతార సెట్ కి వచ్చేటప్పుడు ఏకంగా 8 మందిని వెంటేసుకు వస్తుందంటూ విమర్శించారు.

నయనతార వివాదాలు

Advertisement

పెళ్లికి ముందు పలువురు ప్రముఖులతో ఎఫైర్ కారణంగా నయనతార వివాదాల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక పెళ్లయ్యాక ఈ బ్యూటీ డివోర్స్ తీసుకోబోతుందని రూమర్లు వినిపించాయి. అంతేకాకుండా ఇద్దరు పిల్లలకు ఆమె సరోగసి ద్వారా జన్మనివ్వడం అన్నది కోలీవుడ్ లో దుమారం రేపింది. ఈ విషయంపై గవర్నమెంట్ రియాక్ట్ అవ్వడం, స్పెషల్ గా ఒక కమిటీని ఏర్పాటు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ నివేదికలో అంతా రూల్స్ ప్రకారమే జరిగిందనే విషయం బయటకు రావడంతో వివాదం సద్దుమణిగింది. ఇక ఈ వివాదాలు అన్నిటికంటే ముందు నయనతార సినిమా ప్రమోషన్లకు హాజరుకాదు అనే కంప్లైంట్ కూడా ఉంది. అయితే అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడానికే తను ఇలా ప్రమోషన్ ఈవెంట్లను దాటవేస్తానని ఎప్పటికప్పుడు నయన్ సర్ది చెప్పుకుంటూ వస్తోంది. ఇప్పుడేమో పిల్లల్ని సెట్స్ కి తీసుకురావడమే కాకుండా వాళ్ళ ఆయాలకు కూడా నిర్మాతల నుంచే డబ్బులు గుంజుతోంది అంటూ ఆరోపిస్తున్నారు. మరి ఈ వివాదంపై నయనతార స్పందిస్తుందా ? లేదంటే ఎప్పటిలాగే మౌనం వహిస్తుందా అనేది చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×