E-Paper
Advertisement

BRS: నా చావు కోసం చూస్తున్నారు.. బీఆర్ఎస్‌లో ఇంటి దొంగలున్నారు.. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కలకలం

BRS: నా చావు కోసం చూస్తున్నారు.. బీఆర్ఎస్‌లో ఇంటి దొంగలున్నారు.. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కలకలం
Advertisement
brs office

BRS: అసలే అధికారంలో ఉన్న పార్టీ. ఎమ్మెల్యేగా ఉంటే బిందాస్‌గా సెటిల్ అవ్వొచ్చని అనుకుంటారు. సిట్టింగ్‌లు రిలాక్స్‌గా ఉంటే.. ఆశావహులు నెక్ట్స్ టికెట్ తమకే రావాలని గట్టిగా ట్రై చేస్తుంటారు. అందుకోసం, ప్రస్తుత ఎమ్మెల్యేను ఎంతగా బద్నామ్ చేయాలో అంతగా చేస్తుంటారు. అలాంటి వారిలో మహబూబూబాద్ జిల్లా డోర్నకల్ MLA రెడ్యానాయక్ కూడా పార్టీ నేతల బాధితుడే. తన సీటుకు ఎసరు పెట్టారని ఆయన పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఈసారి మరింత సంచలన కామెంట్లు చేశారు. ఇంతకీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఏమన్నారంటే…

తానెప్పుడూ చస్తానా అని చూసేవాళ్లు చాలా మంది ఉన్నారని రెడ్యానాయక్ అన్నారు. తన ఓటమి కోసం గతంలో పని చేశారని.. భవిష్యత్తులో బీఆర్ఎస్ నుంచి కూడా పని చేస్తారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ లోనే ఇంటి దొంగలున్నారని ఆరోపించారు. పార్టీ పేరు చెప్పుకొని లక్షలు సంపాదిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను ఓడించాటానికి ప్రయత్నాలు చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

కురవి మండలం అయ్యగారిపళ్లి గ్రామంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన పరోక్షంగా మంత్రి సత్యవతి రాథోడ్ ను టార్గెట్ చేసే ఇలా అన్నారని అంటున్నారు. డోర్నకల్‌లో రెడ్యానాయక్‌కు, సత్యవతి రాథోడ్‌కు చాలాకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. ఆ ఆధిపత్య పోరుతో విసుగుచెంది చేసిన ఆరోపణలు కలకం రేపుతున్నాయి.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×