BigTV English

Africa:- మరో మహమ్మారి హెచ్చరిక..! ఆఫ్రికాలో మొదలైన వైరస్..

Africa:- మరో మహమ్మారి హెచ్చరిక..! ఆఫ్రికాలో మొదలైన వైరస్..

Africa:- కోవిడ్ అనేది ఒక్కసారి ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాత మనుషుల్లో జాగ్రత్తతో పాటు భయం కూడా పెరిగిపోయింది. ఆ వైరస్ తర్వాత దానికి సంబంధించిన మరెన్నో వైరస్‌లు కూడా మనుషుల ప్రాణాలను బలిదీసుకున్నాయి. అంతే కాకుండా ఒకప్పుడు అంతరించిపోయిన వైరస్‌లు కూడా మళ్లీ తెరపైకి రావడం అందరినీ కలవరపెడుతోంది. ఆఫ్రికాలో కొత్తగా వ్యాపిస్తున్న రెండు వైరస్‌లు మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.


ఒకప్పుడు ఎబోలా అనే వైరస్ ఆఫ్రికా మొత్తం వ్యాపించి ప్రజలను ఎంతగానో ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు అదే జాతికి చెందిన మార్బర్గ్ అనే వైరస్‌కు సంబంధించిన రెండు వేరియంట్లు అక్కడ వేగంగా వ్యాప్తి చెందడం శాస్త్రవేత్తలు గమనించారు. ఈ వైరస్ బారిన పడినవారు 90 శాతం మరణించే అవకాశం ఉంటుందని అన్నారు. దీనివల్ల మరో మహమ్మారి ప్రపంచాన్ని కమ్మేసే అవకాశం ఉందా అనే కోణంలో వారు పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు.

మార్బర్గ్ అనేది ఒక ఫీవర్‌లాగా మొదలవుతుంది. ముందుగా 1967లో ఈ వైరస్ మొదటిసారి కనిపించింది. కానీ గత కొన్నేళ్లుగా ఆఫ్రికాలో దీనికి సంబంధించిన కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీవ్రమైన జ్వరం రావడం, వాంతులు, విరోచనాలు అనేవి ఇప్పటికే మార్బర్గ్ వైరస్ సోకిన వారిలో ఎక్కువగా కనిపించిన లక్షణాలు. ఇది రక్తం ద్వారా, లేక శరీరం నుండి వెలువడే ఇతర ఫ్యూయిడ్స్ ద్వారా ఒక మనిషి నుండి ఇంకొక మనిషికి వ్యాపిస్తుంది. అంతే కాకుండా బట్టలు లాంటి వాటి వల్ల కూడా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


ఇప్పటికే ఈస్ట్ ఆఫ్రికాలోని టాన్జానియాలో మార్బర్గ్‌కు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. వారిద్దరూ క్వారంటైన్‌లో ఉండడం ద్వారా ఈ కేసులు కంట్రోల్‌లోకి వచ్చాయని అంతర్జాతీయ మీడియా చెప్తోంది. కానీ ఈస్ట్ కోస్ట్‌లో మాత్రం ఇంకా ఈ వైరస్ వ్యాపిస్తూనే ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. అంతే కాకుండా కేసుల విషయంలో ప్రభుత్వాలు పూర్తిగా స్పష్టమైన సమాచారం అందించడం లేదని చెప్తోంది. ఇప్పటివరకు మార్బర్గ్‌కు ఎలాంటి చికిత్స కానీ, మందులు కానీ లేవు.

పలువురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో మార్బర్గ్ వైరస్ ఫేస్ 1లో ఉండగా.. వ్యాక్సిన్ పనిచేస్తుందని కనిపెట్టారు. దీన్ని బట్టి వ్యాక్సిన్ ట్రయల్స్ మొదలుపెట్టాలని శాస్త్రవేత్తలు అనుకుంటున్నా.. డబ్ల్యూహెచ్ఓ మాత్రం దీనికి ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఈ వైరస్ మహమ్మారిగా మారితే.. అందరికీ తగినంత వ్యాక్సిన్‌ను తయారు చేయడం, ఇతర దేశాలకు తరలించడం పెద్ద ఛాలెంజ్ అని డబ్ల్యూహెచ్ఓ అనుకుంటోంది. ఈ వైరస్.. మరో కోవిడ్‌గా మారుతుందేమో అని చాలామంది భయాందోళనలకు గురవుతున్నారు.

భూమి దగ్గరకి దూసుకొస్తున్న అయిదు ఆస్ట్రాయిడ్స్..

for more updates follow this link:-Bigtv

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×