Big Stories

MLC Kavitha: తీహార్ జైలు అధికారుల తీరుపై రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన కవిత..

Kalvakuntla Kavitha latest news
MLC Kalvakuntla Kavitha Approached Rouse Avenue Court

MLC Kalvakuntla Kavitha Approached Rouse Avenue Court(Latest news in telangana): తీహార్ జైలు అధికారుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రూస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటికి తోడు రక్త పోటు సమస్య అధికంగా వుందని పేర్కొన్నారు. తన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకునే కోర్టు తీహార్ జైలు అధికారులకు ఆదేశాలిచ్చందని.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.

- Advertisement -

ఇంటి భోజనాన్ని అనుమతించడంలేదని కవిత పేర్కొన్నారు. బెడ్స్ ఏర్పాటు చేయడం లేదని, కనీసం చెప్పులు కూడా అనుమతించడం లేదని వాపోయారు. బట్టలు, బెడ్ షీట్స్, బుక్స్, బ్లాంకెట్స్ ను కూడా అనుమతించడం లేదని, పెన్ను, పేపర్లు కూడా ఇవ్వట్లేదని కోర్టును ఆశ్రయించారు. కళ్ళజోడు కూడా అనుమతించడం లేదని.. తీహార్ జైలు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

- Advertisement -

Also Read: CM Revanth Reddy : కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా.. సీఎం రేవంత్‌ రెడ్డి హామీ..

తీహార్ జైలు సూపరిడెంట్ కు తగిన ఆదేశాలు ఇవ్వాలని.. కవిత తరఫున రూస్ అవెన్యూ కోర్టులో కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం శనివారం విచారణ జరుపుతామని తెలిపింది. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో జ్యుడీషియల్ కస్టడీ లో భాగంగా కవిత ప్రస్థుతం తీహార్ జైలులో ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News