Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్‌లను మంగళవారం ఉదయం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తాతామధుపై ఎస్సీ-ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి.
తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ వద్ద ఘటనలో చర్యలకు దిగింది ప్రభుత్వం. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను మంగళవారం ఉదయం 7 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని నివాసంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. తాతా మధుపై ఎస్సీ-ఎస్టీ వేధింపుల కింద కేసు నమోదు చేశారు. స్పీకర్ ఓఎస్డీ ఫిర్యాదుతో సైఫాబాద్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
కాసేపట్లో ఎమ్మెల్సీలను నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ వ్యవహారంపై సోమవారం రాత్రి చర్చించిన పోలీసులు, ఇవాళ ఉదయం ఇద్దరు ఎమ్మెల్సీలను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో సభ్యులు ప్రతిఘటించారు. తాము సభకు హాజరుకావాల్సి వుందని, ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. దీంతో పోలీసులతో ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేశారు. కోకాపేట్‌లో నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కాంగ్రెస్ 1000 రోజుల సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు నల్ల టీషర్టులతో సభకు హాజరయ్యేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జరిగిన తోపులాటలో పలువురు సభ్యులకు గాయాలయ్యాయి. అంతేకాదు పోలీసు అధికారులపై ఇష్టానుసారంగా మాట్లాడారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు విడుదల చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్‌పై తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలపై సోమవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకోవాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు.
దీనిపై సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు నోరు విప్పారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తేలే వరకు తదుపరి కార్యక్రమాలు జరగవని తేల్చిచెప్పారు. ఎమ్మెల్సీ తాతామధు వ్యవహారంపై మంగళవారం కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. చర్చ జరిపి, అందుకు సంబంధించిన తీర్మానాన్ని మండలికి పంపే అవకాశం ఉంది.
సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన వ్యవహారంపై చర్యలకు దిగింది ప్రభుత్వం. అసెంబ్లీ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ తాతా మధుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
#Hyderabad:@BRSparty MLC #TataMadhu was arrested at his #NewMLAQuarters residence on Tuesday. Another #MLC, #NaveenKumarReddy, was also #arrested.
A #case was booked against Tata Madhu under the SC/ST Act over his alleged remarks against #TelanganaSpeaker @GpkOfficial_ . pic.twitter.com/gtRwe28sUP
— NewsMeter (@NewsMeter_In) September 8, 2026