E-Paper
Advertisement

జోగులాంబ గద్వాల్లో భూ బకాసురుల పంజా.. నకిలీ పట్టాలతో భూమి ఆక్రమణ!

జోగులాంబ గద్వాల్లో భూ బకాసురుల పంజా.. నకిలీ పట్టాలతో భూమి ఆక్రమణ!
Advertisement

Fake Pattas: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భూ ఆక్రమణదారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రభుత్వ, వివాదాస్పద స్థలాలను లక్ష్యంగా చేసుకుని కొందరు అక్రమార్కులు నకిలీ పట్టాలు సృష్టిస్తూ దర్జాగా కబ్జాలకు తెరలేపుతున్నారు. గద్వాల పట్టణ పరిధిలోని సర్వే నెంబర్ 458 లోని విలువైన భూమిపై భూబకాసురుల కన్ను పడింది.

నకిలీ పత్రాలతో రంగంలోకి..

సర్వే నెంబర్ 458 లో ఉన్న ఖాళీ స్థలాలను ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు పథకం ప్రకారం నకిలీ పట్టాలు, రికార్డులను సృష్టించారు. తమకు ఆ స్థలంపై హక్కులు ఉన్నాయంటూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తూ, అమాయక ప్రజలకు వాటిని అంటగట్టేందుకు లేదా నేరుగా స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Advertisement

Also read: ట్రెండింగ్‌లో బెస్ట్ స్లిమ్ పవర్ బ్యాంక్.. అసలు ధర తెలిస్తే షాక్ అవుతారు!

ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు..

ఈ నకిలీ పట్టాల వ్యవహారంపై స్థానికులు, బాధితులు తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 458 పరిధిలో ఎలాంటి పట్టాలు జారీ చేయలేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు సర్కారు ముద్రలు, ఫోర్జరీ సంతకాలతో తయారు చేసిన పత్రాలను చలామణీలోకి తెస్తున్నారని తేలింది.

ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్..

Advertisement

సర్వే నెంబర్ 458 పరిధిలో అక్రమ నిర్మాణాలను, కబ్జా యత్నాలను వెంటనే అడ్డుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ సీళ్లతో ప్రభుత్వ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్న ముఠాపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నకిలీ పట్టాల వ్యవహారంలో రెవెన్యూ శాఖకు చెందిన సిబ్బంది ఎవరివైనా సహకారం ఉందా అనే కోణంలోనూ సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సర్వే నెం. 458 భూములను కాపాడటంతో పాటు, ప్రజలు ఎవరూ ఈ నకిలీ పట్టాలను నమ్మి కొనుగోలు చేసి మోసపోకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Also read: ఈనెల 14 నుండి 25 వరకు తెలంగాణలో హై అలర్ట్!

Tags

Related News

ఈనెల 14 నుండి 25 వరకు తెలంగాణలో హై అలర్ట్!

దద్దరిల్లిన హన్మకొండ.. వేలాది మంది విద్యార్థులతో కవిత భారీ పాదయాత్ర!

ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కేటీఆర్ ఫైర్!

తెలంగాణ పోలీసులకు బిగ్ షాక్.. అసెంబ్లీ గొడవపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ!

కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, హత్య.. ఆత్యహత్య?

అసెంబ్లీలో మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం.. కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్!

అధ్యక్షా మిమ్మల్నే తిడతారా.. అసెంబ్లీలో తాతా మధుపై సీఎం రేవంత్ ఫైర్!

Big Stories

Advertisement
×