
Lasya Nandita Audio Leak: బీఆర్‌ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో భారీగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అర్హులైన ప్రతి పేదవాడికి ఎలాంటి పైరవీలు లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఘటనలకు మధ్య.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అధికార పార్టీ నేతలే ఇళ్ల పంపిణీ కోసం అక్రమ వసూళ్ల దందాకు తెరలేపిన ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ఏకంగా కంటోన్మెంట్ అభ్యర్థి లాస్య నందిత వసూళ్ల దందాకు చెందిన ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
వైరలైన ఆ ఆడియో.. మాజీ ఎమ్మెల్యే జి.సాయన్న కుమార్తె లాస్య నందితది అని తెలుస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డబ్బులు తీసుకున్నట్టు ఈ ఆడియో ద్వారా తెలుస్తోంది. అయితే ఇళ్లు రాకపోగా.. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఈ వివాదం జరిగింది.
ఈ ఆడియోతో తన తండ్రి సాయన్న పదవిని అడ్డు పెట్టుకుని లాస్య నందిత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ వీడియోలో లాస్య నందిత 5 లక్షలు తీసుకున్నట్లు అంగీకరించింది. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇంటిని ఇప్పించలేనందును మరో రూ.3 లక్షలు వడ్డి కలుపుకొని రూ.8 లక్షలు ఇవ్వాలని బాధితుడు లాస్యనందితను డిమాండ్ చేస్తున్నాడు. అయితే తాను వడ్డి ఇవ్వలేనని, వడ్డీ ఎలా ఇస్తానని ఆమె అతనితో వాదించింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎవరికైనా ఇప్పించి మీకు ఇవ్వకుంటే తనను అడగాలని, ఇప్పటి వరకు ఎవరికి ఇప్పించలేదని అందరితో పాటు మీకు వస్తాయని లాస్య నందిత చెబుతోంది.
.
.