E-Paper
Advertisement

Hyd Car hit to fruit shops: హైదరాబాద్‌లో కారు బీభత్సం, ఫ్రూట్ షాప్‌లోకి దూసుకెళ్లిన..

Hyd Car hit to fruit shops: హైదరాబాద్‌లో కారు బీభత్సం, ఫ్రూట్ షాప్‌లోకి దూసుకెళ్లిన..
Advertisement

Hyd Car hit to fruit shops: అతి వేగం ప్రమాదకరం.. దీనివల్ల చాలామంది నష్టపోతున్నారని తరచు పోలీసులు చెబుతున్నమాట. అయినా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ సిటీలో ఏ సిగ్నల్ వద్ద విన్నా.. మైక్‌లో ఇదే అనౌన్స్మెంట్. వాహనదారులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.

తాజాగా హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌‌‌లో ఓ కారు బీభత్సం సృష్టంచింది. బాపునగర్ వద్ద రోడ్డు పక్కనున్న ఫ్రూట్ షాప్‌లోకి వేగంగా వచ్చిన కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో షాపులో ఉన్న తండ్రికొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్నవారికి స్వల్పగాయాలు అయ్యాయి.

Advertisement

సమీపంలో ఉన్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. స్థానికులు కారు డ్రైవర్‌ని పోలీసులకు అప్పగించారు. ఘటన సమయంలో కారులో ఓ డాక్టరు వున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు? అన్నదే అసలు మేటర్. అయితే కారు పంక్చర్ కావడంతో ప్రమాదానికి కారణమైందని అంటున్నారు. యాక్సిడెంట్ తర్వాత పంక్చర్ అయ్యిందని మరొకరి మాట.

ALSO READ: మెట్రో రైలు ప్రయాణికులకు భారీ శుభవార్త..!

Advertisement

ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ప్రమాదానికి గురైన కారుని అక్కడి నుంచి తొలగించారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×