BigTV English

Weekly Horoscope : వారఫలాలు.. ఈ రాశులవారికి కొత్త ఉద్యోగాలు వస్తాయి.. ఆర్థిక లాభం కూడా..

Weekly Horoscope : వారఫలాలు.. ఈ రాశులవారికి కొత్త ఉద్యోగాలు వస్తాయి.. ఆర్థిక లాభం కూడా..

Weekly Horoscope : మే 19న శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ఫలితంగా వృషభరాశి వారికి శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. మరికొన్ని రాశుల వారికి శుక్రుడి ప్రవేశం.. మంచి ఫలితాలను ఇవ్వనుంది. మరి ఈ వారం ద్వాదశ రాశులవారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయో చూద్దాం.


మేషరాశి

గురు, శుక్ర గ్రహాల ఉనికి కారణంగా.. రాజకీయాల్లో గొప్ప విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు.


వృషభ రాశి

వ్యాపారాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. కొత్త సాంకేతికను వాడటంతో మంచి ప్రయోజనాలు పొందుతారు. నూతన గృహ కొనుగోళ్లు చేసే అవకాశాలున్నాయి. ఖర్చులు పెరగడంతో ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఉంటాయి.

మిథున రాశి

ఆఫీస్ లో మీ ఆధిపత్యం పెరుగుతుంది. పదోన్నతి పొందో అవకాశాలున్నాయి. విదేశాలలో వ్యాపారాలు విస్తరించే అవకాశాలున్నాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో ఆర్థిక లాభం ఉంటుంది. గృహ, వాహన నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటక రాశి

ఆదాయం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు వస్తాయి. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా కుదుటపడతారు.

సింహరాశి

వస్తు సౌకర్యం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు. టూరిజం వ్యాపారంలో ఉన్నవారికి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి.

కన్యరాశి

నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. విదేశీ ప్రయాణం ఉండొచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు కొత్త సమస్యలు ఎదురవుతాయి.

తులారాశి

కొత్త వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తిని కొనేటపుడు లేదా విక్రయించేటపుడు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి సొమ్ముతో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికరాశి

ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్తితో ధనలాభం ఉంటుంది. వ్యాపార లావాదేవీల నిమిత్తం విదేశాలకు వెళ్తారు. పాత అప్పుల్ని తీర్చి ప్రశాంతంగా ఉంటారు.

ధనస్సు రాశి

ఈ వారం మార్కెటింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం పొందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ వారం ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు.

మకర రాశి

వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం ఏర్పడుతుంది. కమీషన్లు తీసుకునేవారికి మంచి లాభాలుంటాయి. బీమా సంబంధిత రంగంలో ఉన్నవారికి ఆశాజనక ఆర్థిక లాభాలుంటాయి.

కుంభరాశి

కొత్త ఇంటిని కొనుగోలు చేసే ప్లాన్లు చేస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. రవాణాకు సంబంధించిన వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ప్రయాణాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

మీనరాశి

అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. ఎగుమతి, దిగుమతి సంబంధిత పనిలో విజయాలను అందుకుంటారు. మతపరమైన కార్యక్రమాలకు ఖర్చులు చేస్తారు.

(Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడినది. సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీన్ని ధృవీకరించడం లేదు.)

 

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×