BigTV English

Warangal Police Commissionerate : మహిళా ఉద్యోగికి వేధింపులు.. ఎస్ఐపై కేసు..

Warangal Police Commissionerate : మహిళా ఉద్యోగికి వేధింపులు.. ఎస్ఐపై కేసు..
Warangal Police Commissionerate

Warangal Police Commissionerate : వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) ఎస్ఐ జి.అనిల్‌పై కేసు నమోదైంది. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న మహిళా ఉద్యోగినిని వేధింపులకు గురిచేశారు అనిల్‌. బాధితురాలు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు బుక్‌ అయ్యింది.


ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో చేపట్టారు. నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి అక్కడ ఎన్నికల విధులు నిర్వహించారు. అక్కడ పోలీసు బందోబస్తు నిర్వహించిన ఎస్ఐ అనిల్‌ సదరు మహిళతో పరిచయం పెంచుకున్నారు. బాధితురాలు కథనం ప్రకారం.. ఆమె ఫోన్‌ నెంబరుకు ఎస్ఐ వాట్సప్‌ ద్వారా సందేశాలు పంపడం ప్రారంభించారు.

ఆమె తన కార్యాలయానికి వెళ్లే సమయంలోనూ ఎస్ఐ తరచూ వెంటపడేవారు. తన చెల్లెళ్లను పరిచయం చేస్తానని చెప్పడంతో నమ్మిన ఆమె ఒకరోజు ఎస్ఐ ఇంటికి వెళ్లారు. ఈక్రమంలో అసభ్యకరంగా ప్రవర్తించడంతో భయపడి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత తాను ఎస్ఐను అని.. తనకు ఎవరూ ఎదురు చెప్పరు అని.. చెప్పినట్లు వినాలి అంటూ తరచూ బెదిరింపులకు దిగాడు.


ఆందోళనకు గురైన ఉద్యోగిని తన భర్తకు విషయం చెప్పింది. ఆయన ఎస్సైను నిలదీయడంతో.. అంతు చూస్తానని ఆయన్ను సైతం బెదిరించాడు. దీంతో బాధితులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించాడని బాధితురాలి భర్త ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ అనిల్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద మరో కేసు కూడా నమోదైంది. ఎస్ఐ ఇలా ప్రవర్తించడం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Tags

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×