ఒకప్పుడు వెస్ట్రన్ సాంగ్స్ కు డ్యాన్సులు చేసిన యూత్.. ఇప్పుడు సంప్రదాయ పాటలకు చక్కటి స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. గత కొంత కాలంగా శ్రీవేంకటేశ్వరుడి పాటకు యువతీ యువకులు లయబద్దంగా నృత్యం చేసే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు దసరా దగ్గర పడుతున్న నేపథ్యంలో గర్బా డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా గుజరాతీ మూలాలు ఉన్న యువత క్రేజీగా డ్యాన్సులు చేస్తూ వావ్ అనిపిస్తున్నారు.
నవరాత్రి సమయంలో గుజరాత్ సంప్రదాయ నృత్యం అయిన గర్బా డ్యాన్స్ బాగా వినిపిస్తుంది. చాలా మంది గుజరాతీలతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా చక్కగా డ్యాన్సులు చేస్తుంటారు. ప్రస్తుతం ఆసియా క్రికెట్ కప్ టోర్నమెంట్ నడుస్తున్న నేపథ్యంలో కుర్రాళ్లు క్రికెట్ మూడ్ లో ఉండిపోయారు. ముఖ్యంగా ఈ లీగ్ లో పాకిస్తాన్ ను భారత్ రెండుసార్లు చిత్తు చేయడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా కొంత మంది కుర్రాళ్లు కలిసి బ్యాట్లు పట్టుకుని క్రేజీగా గర్బా డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. క్రికెట్ బ్యాట్ ను గర్బా డ్యాన్స్ లో భాగంగా ఉపయోగించడం వినూత్నంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది సాంప్రదాయం, ఆధునికతను కలపడానికి ఒక ఆసక్తికరమైన మార్గం అంటున్నారు.
Read Also: ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ఇండియన్ స్టేట్ ఇదే, వామ్మో.. ఏడాదిలో అంత మందా?
అటు ముంబై లోక్ ట్రైన్ లో మహిళలు, యువతులు చక్కగా గర్బా డ్యాన్స్ వేస్తూ ఆకట్టుకున్నారు. చక్కటి పాటలకు లయబద్దంగా డ్యాన్స్ చేసి కనువిందు చేశారు. రైలు కదులుతున్నప్పటికీ, మహిళలు అలాగే ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ సరదాగా గడిపారు. మరికొంత మంది యువతులు లోకల్ ట్రైన్ రద్దీగా ఉన్నప్పటికీ ఆకట్టుకునేలా గర్బా డ్యాన్స్ చేశారు. దసరా పండుగ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ డ్యాన్సులను చూసి నెటిజన్లు ఎంతో మెచ్చుకుంటున్నారు. ప్రయాణ సమయంలో స్ట్రెస్ ఫీల్ కాకుండా మహిళలు చక్కగా గర్బా డ్యాన్స్ చేయడం చూడ ముచ్చటగా ఉందంటున్నారు. పండగ సందర్భంగానే కాకుంగా నిత్యం ఇలాగే ఎంజాయ్ చేస్తూ, రాకపోకలు కొనసాగించాలని కోరుకుంటున్నారు. అటు ఈ వీడియోలకు బోలెడు వ్యూస్, పెద్ద సంఖ్యలో లైకులు, కామెంట్స్ కూడా లభిస్తున్నాయి. చూసిన ప్రతి ఒక్కరూ డ్యాన్స్ బాగుందని పొగడ్తలు గుప్పిస్తున్నారు.
Read Also: భారత పర్యాటకులకు మాస్కో సాదర స్వాగతం, కారణం ఏంటో తెలుసా?