BigTV English

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

DVV Danayya About OG Title: ఓజీ.. ఈ పేరుకి ఉన్న వైబ్ ఎలాంటిదో పవన్‌ ఫ్యాన్స్‌ బాగా చెబుతారు. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఈ టైటిల్‌ మారుమ్రోగుతుంది. భారీ అంచనాల మధ్య నేడు (సెప్టెంంబర్‌ 25) ఓజీ థియేటర్లలోకి వచ్చింది. ఇక ముందు రోజు ప్రీమియర్స్‌ వచ్చిన రెస్పాన్స్‌ చూస్తుంటే.. మూవీపై బజ్‌ ఏ స్థాయిలో ఉందో ఇప్పటికే మీకు అర్థమైపోతుంది. హరి హర వీరమల్లు సినిమాకు ఇంతకంటే హైప్‌ వచ్చింది. కానీ, వసూళ్ల పరంగా మాత్రం ఈ చిత్రం నిరాశ పరిచింది. ఓజీ విషయంలోనూ అదే రిపీట్‌ అవుతుందని మూవీ టీం నుంచి ఫ్యాన్స్‌ వరకు భయపడ్డారు.


ఆల్ టైం రికార్డు

కానీ, ఊహించని విధంగా ఓజీ రెస్పాన్స్‌ అందుకుంది. ఏ ఒక్క థియేటర్‌ కూడా వదలకుండ అన్ని థియేటర్లలో ప్రీమియర్స్ షోలు పడి ఆల్‌ టైం రికార్డు క్రియేట్‌ చేసింది. పైగా థియేటర్లలని కూడా హౌజ్‌ ఫుల్‌. అది ఓజీ టైటిల్‌కి వచ్చిన వైబ్‌. అయితే నిజానికి ఈ సినిమా టైటిల్‌ని మూవీ నిర్మాతల సొంతం కాదట. ప్రముఖ ప్రొడ్యూసర్‌ నాగవంశీ పవన్‌ కోసం ఓజీని త్యాగం చేశారట. ఈ విషయాన్ని నిర్మాత డీవీవీ దానయ్య రివీల్‌ చేశారు. నేడు జరిగిన సక్సెస్‌ మీట్‌లో మాట్లాడుతూ.. నిర్మాత డీవీవీ దానయ్య అసలు విషయం చెప్పారు.

ఓజీ టైటిల్ ఆయనది..

ఓజీ సక్సెస్‌తో ఫుల్‌ ఖుష్‌లో ఉన్నారు నిర్మాత డీవీవీ. ఇదే ఆనందాన్ని ప్రెస్‌ మీట్‌లోనూ వ్యక్తం చేశారు. మూవీ సకెస్‌ని పంచుకుంటూ అసలు విషయం చెప్పారు. ఈ సందర్బంగా డైరెక్టర్ త్రివిక్రమ్‌, తమన్‌కి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మరో స్పెషల్‌ పర్సన్‌ కి కూడా థ్యాంక్స్ చెప్పలంటూ దానయ్య అసక్తి విషయాన్ని బయటపెట్టారు. నిజానికి ఈ సినిమాకు ముందుగా మేము ఓజీ అనుకోలేదు. ఈ టైటిల్‌ కూడా మాది కాదు. దీనికి ఓజీని సజెస్ట్‌ చేసింది నిర్మాత నాగవంశీ. ముందుగా ఈ టైటిల్‌ రిజిస్టర్‌ చేసుకుంది ఆయనే. ఈ సినిమా కథ తెలిసి ఆయన ఈ టైటిల్‌ ఇచ్చేసారు. ఇందుకు ఆయనకు నా స్పెషల్‌ థ్యాంక్స్‌ చెబుతున్నా” అంటూ దానయ్య చెప్పుకొచ్చారు.


వరల్డ్ వైడ్ రూ. 160 కోట్లు

మొదటి నుంచి ఓజీ మూవీపై భారీ హైప్‌ ఉంది. సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌ మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. అదే బజ్‌.. థియేటర్‌లోనూ వినిపించింది. ఓజీ ప్రీమియర్స్‌ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇక థియేటర్లన్ని హౌజ్ ఫుల్‌తో కళకళలాడాయి. తెలుగు సినీ చరిత్రలో ఎన్నడు లేని విధంగా అత్యధిక ప్రీమియర్స్‌ షోలతో ఓజీ ఆల్‌ టైం రికార్డు కొట్టింది. ఒక్క నిజాంలోనే ఈ మూవీ సుమారు 366కుపైగా థియేటర్లలో ప్రీమియర్‌ షోలు ప్రదర్శించడం విశేషం. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌ చూస్తే ఓజీ కలెక్షన్స్‌ రూ. 160 కోట్లకు పైగా కలెక్షన్స్‌ చేసే అవకాశం ఉందని ట్రేడ్‌ పండితులు అంచన వేస్తున్నారు.

Related News

Chiranjeevi Vs Balakrishna: మరోసారి బయటపడ్డ మెగా నందమూరి విభేదాలు.. అసలు గొడవ అక్కడేనా?

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యంగ్య కామెంట్స్‌పై చిరంజీవి స్పందన.. కీలక ప్రకటనతో..

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Big Stories

×