BigTV English

Ayodhya Ram Mandir: అయోధ్యలో రజనీకాంత్ మాట్లాడిన తీరును తప్పుబట్టిన డైరెక్టర్..!

Ayodhya Ram Mandir: అయోధ్యలో రజనీకాంత్ మాట్లాడిన తీరును తప్పుబట్టిన డైరెక్టర్..!

Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి సంబంధించిన ప్రముఖులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అందులో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. ఈయన ఈ వేడుక అనంతరం మాట్లాడిన కొన్ని మాటలను ప్రముఖ డైరెక్టర్ తప్పుబట్టారు. అయితే మరి రజనీకాంత్ ఏమని మాట్లాడారు. అందులోని మాటలను ఏ డైరెక్టర్ తప్పుబట్టారు అనే విషయానికొస్తే..


అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగిన తర్వాత రజనీకాంత్ మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ప్రారంభోత్సవం చారిత్రాత్మకమని అన్నారు. 500 ఏళ్ల నాటి సమస్య ఈ రోజు పరిష్కారమైంది అంటూ మాట్లాడారు. ఈ వాఖ్యలను దర్శకుడు పా. రంజిత్ తప్పుబట్టారు. ఈ మేరకు రజనీకాంత్‌పై పా. రంజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యకు వెళ్లడం, రాముడి దర్శనం చేసుకోవడం రజనీకాంత్ వ్యక్తగతమని చెప్పారు. కానీ 500 ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం లభించిందంటూ మాట్లాడటం సరైనది కాదు అంటూ విమర్శించారు. అలాగే ఇళ్ల ముందు దీపాలు వెలిగించని వాళ్లను ఉగ్రవాదులుగా చూస్తున్నారని అన్నారు. ఇలాంటి రాజకీయాల నుంచి విముక్తి రావాలి అంటూ అతడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా తమిళ ఇండస్ట్రీలో వీరిద్దరూ మంచి స్నేహితులు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికీ కబాలి, కలా వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల తర్వాత కూడా రంజిత్- రజనీకాంత్ మధ్య మరిన్ని సినిమాలు వస్తాయని గుసగుసలు వినిపించాయి. కానీ, ఇప్పుడీ మాటల యుద్ధం ఎక్కడివరకు దారి తీస్తుందోనని అభిమానులు కంగారు పడుతున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×