YSRCP Activist Death: అనంతపురం జిల్లా పామిడి మండలానికి చెందిన వైసీపీ కార్యకర్త.. దేవన సతీశ్ రెడ్డి (33) బుధవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యువకుడు ఇటీవలే వైసీపీ రూరల్ బూత్ కన్వీనర్గా నియమితులయ్యారు.
స్థానికుల సమాచారం ప్రకారం, బుధవారం రాత్రి పామిడి నుంచి తన గ్రామం కొట్టాల వెళ్తున్న సమయంలో.. కాలాపురం గ్రామ సమీపంలో సతీశ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. మొదట దాన్ని సాధారణ రోడ్డు ప్రమాదంగా భావించినా, ఆయన శరీరంపై రక్తపు గాయాలు, కొంత అనుమానాస్పద పరిస్థితులు కనిపించడంతో.. గ్రామస్థులు షాక్‌కు గురయ్యారు.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
సతీశ్ మృతి వెనుక రెండు కోణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. రోడ్డు ప్రమాదమా లేక హత్యా అన్న కోణంలో అనుమానిస్తున్నారు.
సతీశ్ ఇటీవలే బూత్ కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఆయనకు స్థానికంగా సపోర్ట్ పెరగడంతో పాటు.. కొంత వ్యతిరేకత కూడా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన మృతి వెనుక వ్యక్తిగత వైరం, రాజకీయంగా లేదా యాదృచ్ఛిక ప్రమాదమా అన్నది దర్యాప్తుతో తేలాల్సి ఉంది.
మరణ వార్త తెలిసిన వెంటనే గ్రామానికి చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇది కచ్చితంగా ప్రమాదం కాదు ఎవరో హత్య చేసిందే అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నాయకులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతో మాట్లాడారు.
వైసీపీకి చెందిన ఒక చురుకైన కార్యకర్త ఇలా అనుమానాస్పదంగా.. మృతి చెందడం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ముఖ్యంగా, ఇటీవల పార్టీ అంతర్గత విభేదాలు, వర్గపోరులు కూడా కొన్నిచోట్ల కనిపించడం వల్ల ఈ మృతి చుట్టూ మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు అసలు కారణం ఏంటన్నది చెప్పడం కష్టం.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో మృతదేహాన్ని, బైక్‌ను పరిశీలిస్తున్నారు. కాలాపురం గ్రామ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షుల వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతి వెనుక నిజమైన కారణం స్పష్టత రానుంది.
Also Read: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది
అతనంపురం జిల్లా పామిడి మండలం వైసీపీ కార్యకర్త సతీశ్ రెడ్డి మృతి మిస్టరీగా మారింది. ఇది యాదృచ్ఛిక రోడ్డు ప్రమాదమా? లేకపోతే హత్యా? అన్నది దర్యాప్తులో తేలనుంది.