Chiranjeevi Vs Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్నార్ తర్వాత చిరంజీవి బాలకృష్ణ రెండు కళ్ళు లాంటివారని చెబుతారు. ఈ ఇద్దరు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఇండస్ట్రీకి ఎంతో సేవ చేస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇకపోతే ఈ ఇద్దరు స్టార్ హీరోలే అయినప్పటికీ ఇద్దరి మధ్య సరైన సఖ్యత మాత్రం లేదనేది మొదటి నుంచి ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఈ ఇద్దరు హీరోలు పలు వేదికలపై కనిపించినా, వ్యక్తిగతంగా మాత్రం వీరికి అభిప్రాయ భేదాలు ఉన్నాయంటూ తరచూ ఎన్నో వార్తలు వినపడుతూనే ఉన్నాయి.
ఇకపోతే చిరంజీవి బాలకృష్ణ మధ్య అభిప్రాయ బేధాలు ఉన్న మాట వాస్తవమే . అయితే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కేవలం కెరియర్ విషయంలోనూ, సినిమాల విషయంలో రావడంతో అధికాస్త వ్యక్తిగతంగా మారాయని తెలుస్తోంది. చిరంజీవి బాలకృష్ణ మద్య బేధాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలోనే బాలయ్యకు సంబంధించిన వేడుకలకు చిరంజీవి దూరంగా ఉండటం, చిరంజీవికి సంబంధించిన వేడుకలకు బాలకృష్ణ దూరంగా ఉండటం జరుగుతుంది. ఇకపోతే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి కూడా చిరంజీవి దూరంగా ఉన్నారు.
నిజానికి ఈ టాక్ షో చిరంజీవి బావ అయిన అల్లు అరవింద్ నిర్వహిస్తున్న టాక్ షో. ఈ కార్యక్రమానికి మెగా హీరోలైన రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ వంటి వారు వచ్చారే తప్ప చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. ఇలా అన్ స్టాపబుల్ కార్యక్రమానికి రాకపోవడానికి కూడా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలే కారణమని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరయ్యారు తప్ప చిరంజీవి మాత్రం హాజరు కాలేదు. ఇటీవల కాలంలో బాలకృష్ణ చిరంజీవి రాజకీయాలకు సంబంధించిన అంశాలలో ఒకే వేదికపై కనిపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం…
పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార సమయంలో బాలయ్య చిరంజీవి ఒకే వేదికపై ఉన్నారు అందుకు కారణం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల పరంగా కూటమిలో భాగం అయిన నేపథ్యంలోనే చిరంజీవి తప్పనిసరి పరిస్థితులలో బాలకృష్ణతో కలిసి కనిపిస్తున్నారు కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇంట ఇప్పటివరకు ఎన్నో వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమాలలో టాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం హాజరైన బాలకృష్ణ మాత్రం దూరంగా ఉంటున్నారు.
చిరంజీవి ఏం మాట్లాడలేదు…
తాజాగా మరోసారి ఇద్దరి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. ఇవాళ అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి మాట్లాడుతూ… చిరంజీవి గట్టిగా మాట్లాడటం వల్లే జగన్మోహన్ రెడ్డి సినీ సెలబ్రిటీలతో భేటీ అయ్యారు అనడం అబద్ధం అంటూ చిరంజీవి గురించి బాలకృష్ణ కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఇక చిరంజీవి ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ బాలకృష్ణకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.
సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది దర్శక నిర్మాతలు తనని కలిసి వారి బాధలు నాతో చెప్పుకున్న నేపథ్యంలోనే నేను అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన పేర్ని నానితో ఫోన్ లో మాట్లాడానని. జగన్మోహన్ రెడ్డి స్వయంగా నన్ను కలుస్తానని చెప్పటం వల్లే తనని కలిసి మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డికి ఇండస్ట్రీ సమస్యలు చెప్పడమే కాకుండా ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందనే వాదన కూడా ఉంది మీరు అనుమతి తెలిపితే సినిమా వాళ్ళని కూడా తీసుకు వస్తానని చెప్పాను. అందుకు ఆయన అనుమతి ఇవ్వటంతోనే కొంతమందితో కలిసి తాను వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిసాను అంటూ బాలయ్యకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డ విభేదాలు..
ఇలా బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గురించి మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా రీ కౌంటర్ ఇస్తూ పత్రిక ప్రకటన విడుదల చేయడంతో మరోసారి ఇద్దరి హీరోల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని స్పష్టమవుతుంది. ఇక ఈ ఘటనతో మరోసారి సోషల్ మీడియాలో మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ వార్ జరగటం కూడా ఖాయమని స్పష్టమవుతుంది.
Also Read: OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!