BigTV English

Sayanna : ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు..

Sayanna : ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి ప్రముఖులు నివాళులు..

Sayanna : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి పలువురు నాయకులు నివాళులు అర్పించారు. తొలుత ఆయన భౌతికకాయాన్ని కార్ఖానాకు తరలించారు. ప్రజలు, అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం క్యాంప్‌ కార్యాలయంలో పార్థివ దేహాన్ని ఉంచారు. క్యాంపు కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.


సాయన్న భౌతికకాయానికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్‌ నివాళులర్పించారు. ఎమ్మెల్యే సాయన్న కార్యాలయం వద్దకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి అంతిమయాత్రకు సంబంధించి అధికారులు చేసిన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలీసు అధికారులు, స్థానిక నేతలకు పలు సూచనలు చేశారు. మారేడుపల్లిలోని శ్మశానవాటికలో సాయన్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఎమ్మెల్యే సాయన్న మృదు స్వభావి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అశోక్ నగర్‌లోని ఎమ్మెల్యే సాయన్న నివాసంలో పార్థివదేహానికి నివాళులర్పించారు. పార్టీలకు అతీతంగా అందరితో సాయన్న కలివిడిగా స్నేహపూర్వకంగా వ్యవహరించే వారని తెలిపారు. ప్రజల మధ్యనే నిరాడంబరంగా ఉండే నాయకుడు సాయన్న మృతిచెందడం చాలా బాధాకరమని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కంటోన్మెంట్‌ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని అన్నారు. సాయన్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Sridhar : అమితాబ్ బంధువులకు టోకరా.. సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌ అరెస్ట్..

Gang Rape : మహిళ కిడ్నాప్.. కారులో గ్యాంగ్ రేప్.. హైదరాబాద్‌లో దారుణం..

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×