E-Paper
Advertisement

Chiranjeevi: పూరి జ‌గ‌న్నాథ్‌కి చిరంజీవి కండీష‌న్స్‌!

Chiranjeevi: పూరి జ‌గ‌న్నాథ్‌కి చిరంజీవి కండీష‌న్స్‌!
Advertisement

Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం చిరంజీవి మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంక‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత మెగాస్టార్ నెక్ట్స్ మూవీ ఏంట‌నేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు పూరీ జ‌గ‌న్నాథ్ రీసెంట్‌గా చిరంజీవిని క‌లిసి త‌న స్టోరి పాయింట్ చెప్పార‌ట‌. చిరుకి కూడా ఆ పాయింట్ న‌చ్చింది. అయితే పూరీతో సినిమా చేయ‌టానికి మెగాస్టార్ రెండు కండీష‌న్స్ పెట్టిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

ఇంత‌కీ పూరీ జ‌గ‌న్నాథ్‌కి చిరంజీవి పెట్టిన ఆ కండీష‌న్స్ ఏంటంటే.. నెల రోజుల్లో పూర్తి స్క్రిప్ట్‌తో రావాల్సి ఉంటుంది. ప‌క్కాగా న‌చ్చితేనే ఓకే చెబుతాన‌నేది ఒక‌టి. ఇక రెండో కండీష‌న్ ఏంటంటే నెల రోజులు మాత్ర‌మే డేట్స్ కేటాయిస్తాన‌ని దాని ప్ర‌కారంగా త‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయాల‌నేది. దానికి పూరి ఓకే చెప్పార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకు కార‌ణం.. ఆయ‌న‌కు ఇప్పుడు సాలిడ్ హిట్ కావాలి. మంచి హీరోతో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేస్తే పూరి ఏ రేంజ్‌లో హిట్ కొడ‌తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పూరి ఇప్పుడు చిరంజీవి సినిమా స్క్రిప్ట్‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ట‌.

Advertisement

ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన వాల్తేరు వీర‌య్య చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టారు. దీంతో పూరీ జ‌గ‌న్నాథ్ ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని రెడీ అవుతున్నారు. నిజానికి చిరంజీవి 150వ చిత్రంగా ఆటో జానీ అనే క‌థ‌ను పూర్తి సిద్ధం చేశారు. అందులో ఫ‌స్టాఫ్ బాగా న‌చ్చింది. కానీ ఎందుక‌నో సెకండాఫ్ నచ్చ‌క చిరంజీవి నో చెప్పేశారు. తర్వాత గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో పూరీ జగన్నాథ్ కలిసి నటించారు. అప్పుడు మంచి స్క్రిప్ట్‌తో వస్తే పూరితో సినిమా చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దీంతో మెగాస్టార్‌కి నచ్చేలా స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు పూరి.

Taraka Ratna: తారకరత్న టాటూ స్పెష‌ల్‌ .. ఎవ‌రి కోస‌మో తెలుసా!

Advertisement

Jr NTR Taraka Ratna: తార‌క‌ర‌త్న‌కు ఎన్టీఆర్ సాయం

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×