Chakali Ailamma Death Anniversary Program: సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతామంటూ ఆయన మంగళవారం సాయంత్రం ప్రకటించారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చరిత్ర ఎప్పటికీ మరువలేనిది. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. భూముల ఆక్రమణలు అడ్డుకోవడంలో చాకలి ఐలమ్మ మా ప్రభుత్వానికి స్ఫూర్తి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం చాకలి ఐలమ్మ కుటుంబాన్ని సన్మానించారు.
Also Read: ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా?
అదేవిధంగా చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.