Honey Trap: కష్టపడటానికి ఇష్టం లేని కొందరు సులువుగా డబ్బు సంపాదించే మార్గాలు ఎంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ పోకడ విపరీతమైంది. డబ్బులు ఎక్కువ ఉన్నాయని భావించి యోగా గురువును హనీ ట్రాప్ చేసింది ఓ గ్యాంగ్. ఏకంగా రెండు కోట్లకు డిమాండ్ చేసింది. చివరకు పోలీసుల చేతికి ఆ గ్యాంగ్ చిక్కింది. ఇంకా ఏం జరిగిందంటే..
రంగారెడ్డి జిల్లాలో చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నాడు రంగారెడ్డి అనే వ్యక్తి. యోగా ఆశ్రమం అనగానే చాలామంది వస్తుంటారు. సదుపాయాల కోసం వచ్చినవారు నిధులు పెద్దల మొత్తంలో ఇస్తుంటారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకుంది అమర్ అండ్ గ్యాంగ్. ఎలాగైనా యోగ గురు వద్ద నిధులు సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసింది.
ఇద్దరు మహిళలతో రంగారెడ్డిపై హానీ ట్రాప్ వల విసిరింది. తొలుత అనారోగ్య సమస్యల పేరుతో యోగ ఆశ్రమంలో చేరారు ఇద్దరు మహిళలు. కొద్దిరోజుల తర్వాత వారిద్దరు గురువు రంగారెడ్డితో క్లోజ్‌గా మూవ్ కావడం మొదలుపెట్టారు. రంగారెడ్డి తో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ తర్వాత వాటిని చూపించి యోగా గురువు రంగారెడ్డిపై బ్లాక్ మెయిల్‌కు దిగింది అమర్ అండ్ కో గ్యాంగ్.
మొదట 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది ఆ గ్యాంగ్. వాటికి సంబంధించిన చెక్కులను ఇచ్చాడు రంగారెడ్డి. ఇదేకాకుండా మరో రెండు కోట్లు డబ్బులు ఇవ్వాలని మెలిక పెట్టింది ఈ గ్యాంగ్. రంగారెడ్డిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలైంది. పరిస్థితి గమనించిన రంగారెడ్డి జరిగిన విషయాన్ని నేరుగా గోల్కొండ పోలీసుల దృష్టికి తెచ్చారు.
ALSO READ: నా మొగుడే కావాలా? నడిరోడ్డుపై స్థంభానికి కట్టేసి
రెండు కోట్లు ఇస్తానని చెప్పించి గోల్కొండకు అమర్ అండ్ గ్యాంగ్‌ను పిలిచారు పోలీసులు. గోల్కొండకు వచ్చిన ఐదుగురు వ్యక్తులు గోల్కొండ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో అమర్, మౌలాలి, రాజేష్, మంజుల, రజినిలను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు.
పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఈ మధ్యకాలంలో హనీట్రాప్ వ్యవహారాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు మహిళల వలలో కొందరు డబ్బున్నవారు పడిన సందర్భాలు ఉన్నాయి. తొలిసారి ఓ గ్యాంగ్ మహిళలను వల వేసి యోగా గురువుని నిధులు కొట్టేసి ప్లాన్ చేసి అడ్డంగా బుక్కయ్యారు.