EPAPER

Janhvi Kapoor: దేవరలో జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఆ స్టార్ నటి అని మీకు తెలుసా.. ?

Janhvi Kapoor: దేవరలో జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఆ స్టార్ నటి అని మీకు తెలుసా.. ?

Janhvi Kapoor: ప్రస్తుతం వేరే ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్  కు పరిచయమవుతున్న   హీరోయిన్స్..  చాలా కష్టపడుతున్నారు. మొదటిసారి  వేరే భాషలో ఎంట్రీ ఇస్తున్నా.. కష్టపడి ఆ భాషను నేర్చుకొని డబ్బింగ్ కూడా  వారే చెప్పుకోడానికి ప్రయత్నిస్తున్నారు.


మొన్నటికి మొన్న కల్కి సినిమా కోసం దీపికా పదుకొనే కూడా మొదట తన డబ్బింగ్ తానే చెప్పింది. కానీ, ఆ పాత్రకు దీపికా వాయిస్ సెట్ కాకపోవడంతో చివరి నిమిషంలో మార్చడం జరిగింది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా కూడా తెలిపారు.

ఇక దేవర సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతుంది బాలీవుడ్ బ్యూటీ  జాన్వీ కపూర్. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ రొమాన్స్ చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను  విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు దేవర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జాన్వీ.. తంగం అనే పాత్రలో నటిస్తుంది.


ఇక  ఈ ట్రైలర్ లో జాన్వీకు కూడా డైలాగ్స్ ఉన్నాయి. పిరికివాడు అయిన వరాను చూసి  ” ఆడికి ఆడి అయ్యా రూపం వచ్చింది కానీ, రక్తం రాలేదే” అంటూ చెప్పే డైలాగ్  ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం జాన్వీ డబ్బింగ్ చెప్పలేదని ఈ వాయిస్ ను బట్టే అర్ధమవుతుంది.

రెండు మూడు సార్లు ఈ వాయిస్ వినగానే.. జాన్వీకి డబ్బింగ్ చెప్పింది ఎవరో ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేయగలరు. మరి ఇంతకు ఆ వాయిస్ ఎవరిది అని అనుకుంటున్నారా.. ?  ఇంకెవరిది.. అందాల హాట్ బ్యూటీ అనసూయది. అవును మీరు వింటుంది నిజమే.. జాన్వీకి అనసూయనే డబ్బింగ్ చెప్పిందని తెలుస్తోంది. ఆమె వాయిస్ స్పష్టంగా తెలుస్తోంది.

జాన్వీ పాత్రకు అనసూయ వాయిస్  బాగానే సెట్ అయ్యినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే అనసూయకు  కూడా మంచి పేరు వస్తుందనే చెప్పొచ్చు. మరి ఈ డబ్బింగ్ చెప్పడంపై అనసూయ  ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.

Related News

Sri Vishnu : “అల్లూరి” డిస్ట్రిబ్యూటర్స్ న్యాయపోరాటం… రెండేళ్లు దాటినా పట్టించుకోని ప్రొడ్యూసర్

Vettaiyan : నటీనటుల రెమ్యునరేషన్ ఎంతంటే.. ఎవరికి ఎక్కువ అంటే..?

Sarangapani Jathakam : ‘సారంగపాణి’ జాతకం కాదు… ముందు ఇంద్రగంటి, దర్శిల జాతకం మారాలి

SD18 : సాయి ధరమ్ తేజ్ బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది..స్పెషల్ వీడియోతో ట్రీట్ అదిరింది మామా…

Shraddha Kapoor: పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. గంతకు తగ్గ బొంతే..!

Sandeep Reddy Vanga With RGV : రెండు సినిమా పిచ్చి ఉన్న జంతువులు, అనిమల్ పార్కులో కలిసాయి

Aadhi Sai Kumar: కెరియర్ లో ఉన్నది ఒకటే హిట్ సినిమా, అదే మళ్లీ రీ రిలీజ్

Big Stories

×