Rajinikanth: కొన్నిటి గురించి ఎంత రాసిన వివరించలేము. అలాంటి అంశాలలో ఇళయరాజా సంగీతం కూడా ఒకటి. ఇళయరాజా సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ముఖ్యంగా ఇళయరాజా పాటలు ఒక ప్రశాంతత ను ఇస్తాయి. ఒక సరికొత్త లోకానికి తీసుకెళ్తాయి. తెలుగు సినిమా చరిత్రలో ఎంతమంది సంగీత దర్శకులు వచ్చినా కూడా ఇళయరాజా గారి స్థానం ప్రత్యేకంగా ఉంటుంది. అయితే రీసెంట్ టైమ్స్ లో ఇళయరాజా గారి మీద కొన్ని నెగటివ్ కామెంట్స్ తో పాటు విపరీతమైన నెగెటివిటీ కూడా వస్తుంది.
ముఖ్యంగా ఇళయరాజా పాటలు చాలామందికి వినసొంపుగా ఉంటాయి. ఇళయరాజా టాలెంట్ ను మరోసారి ఈ జనరేషన్ కి గుర్తు చేద్దాం అని కొంతమంది దర్శకులు తమ సినిమాలలో పెడుతూ ఉంటారు. అదే ఆయా దర్శకులకు శాపంగా మారుతుంది. ఇళయరాజా ఇమిడియెట్ గా కాపీరైట్ చేస్తూ ముందుకు వస్తారు. ఇళయరాజా కు విపరీతమైన ఉన్న గౌరవం అంతా కూడా కన్సర్ట్స్ లో బాలు తన పాటలు పాడకూడదు అని కోర్టుకెళ్ళినప్పుడు పోయింది.
ఇళయరాజా తాను కంపోజ్ చేసిన కొన్ని పాటలను కన్సర్ట్స్ లో పాడకూడదు అని బాలుకి చెప్పారు. అదే విషయంలో కోర్టుకు కూడా వెళ్లి ఇళయరాజా గెలిచారు. గెలిచిన తరుణంలోనే బాలు కన్సర్ట్స్ లో పాటలు పాడారు. ఇదే విషయాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్గా జరిగిన ఒక కార్యక్రమంలో రివిల్ చేశారు. ఈ కార్యక్రమం ఇళయరాజా కు సంబంధించింది. ఈ విషయాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ కోట్ చేస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు.
ప్రముఖ లెజెండరీ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇళయరాజా కంపోజిషన్ తన గాత్రంతో వన్నెతెచ్చారు. ఈ విషయాన్ని రజనీకాంత్ మరో మారు గుర్తు చేశారు. ఇళయరాజా కాపీరైట్ సమస్య కోసం కోర్టుకు వెళ్లి గెలిచాడు. అదే రోజు ఎస్పీబీ ఒక కచేరీలో పాడబోతున్నప్పుడు, ఇళయరాజా ఆపమని అడిగారు. కోవిడ్ సమయంలో ఎస్పీబీ మరణించగా, ఇళయరాజా ఏడ్చారు, సోదరుడు, కూతురు & భార్య కోసం కన్నీళ్లు పెట్టుకోలేదు. అంటూ ఇళయరాజా వ్యక్తిత్వాన్ని గురించి బయటపెట్టారు. పొరపాట్లు చేయడం అనేది సహజం. కానీ బాలు అంటే ఇళయరాజాకు ఎంత ఇష్టం ఉందో రజనీకాంత్ మాటల్లో మరోసారి అర్థమయింది.
Also Read : Sai Tej : సాయి తేజ్ పై ట్రోల్స్, జానీ మాస్టర్ ను ఎందుకు వదిలేసినట్టు