Onion Juice For Hair Growth: జుట్టు రాలడం సమస్య నేడు ఒక సాధారణ సమస్యగా మారింది. జుట్టు రాలడానికి పర్యావరణం, చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు మొదలైన అనేక కారణాలు ఉంటాయి. కానీ జుట్టు రాలిన తర్వాత కొత్త జుట్టు పెరగనప్పుడు సమస్య తలెత్తుతుంది.
జుట్టు రాలడాన్ని తగ్గించడానికి చాలా మంది మార్కెట్లో దొరికే వివిధ రకాల నూనెలు, షాంపూలతో పాటు వివిధ రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతగా ఉండదు. ఇలాంటి సమయంలోనే నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి. ముఖ్యంగా ఉల్లిపాయ రసం జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మరి జుట్టు ఒత్తుగా పెరగాలంటే, రాలకుండా ఉండాలంటే.. ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు, ఉల్లిపాయ రసం:
జుట్టుకు ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు మేలు జరుగుతుంది. కరివేపాకును ఉల్లిపాయ రసంతో కలిపి జుట్టుకు అప్లై చేస్తే దాని ఫలితాలు రెట్టింపు అవుతాయి. కరివేపాకు , ఉల్లిపాయ రసం కలిపి జుట్టును పెంచడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అంతే కాకుండా ఇది జుట్టుకు పోషణను అందించడంతో పాటు, జుట్టును కుదుళ్ల నుండి బలంగా, ఆరోగ్యంగా చేస్తుంది. ఇది మాత్రమే కాదు, మీరు తెల్ల జుట్టు సమస్యతో కూడా ఇబ్బంది పడుతుంటే.. ఈ పరిహారం దీనికి కూడా ప్రభావ వంతంగా ఉంటుంది. ఈ రెమెడీని తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా ఉపయోగించవచ్చు.
జుట్టు పెరుగుదల కోసం:
ఇందుకోసం మీరు 1 చిన్న కప్పులో కరివేపాకును తీసుకుని దానిని మెత్తగా రుబ్బుకుని, అందులో చిన్న కప్పు ఉల్లిపాయ రసాన్ని కలపాలి. ఈ పేస్ట్ ని మీ జుట్టు మూలాలకు బాగా అప్లై చేసి 40 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత తలస్నానం చేయండి.
ఉల్లిపాయ రసం, అవిసె గింజలు:
అవిసె గింజలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఉల్లిపాయ రసంతో పాటు అవిసె గింజలను జుట్టుకు వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
Also Read: తులసి ఆకులు తింటే.. బోలెడు ప్రయోజనాలు !
వాడే విధానం:
ముందుగా కాస్త అవిసె గింజలను తీసుకుని మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేయాలి. ఇప్పుడు మీరు దీనికి తాజా ఒక కప్పు ఉల్లిపాయ రసం కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తర్వాత దీనిని తలకు బాగా అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు యొక్క కుదుళ్లు బలంగా మారతాయి. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. కొత్త జుట్టు పెరగడం కూడా ప్రారంభమవుతుంది.
అవిసె గింజ్లలో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అంతే కాకుండా జుట్టు పొడవుగా పెరిగేలా చేస్తాయి. ఉల్లిరసంతో వీటిని కలిపి నప్పుడు అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. తరచుగా వీటిని జుట్టుకు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.