E-Paper
Advertisement

KCR Farm House | కేసీఆర్‌ను కలిసేందుకు ఫామ్ హౌస్ వెళ్లిన చింతమడక గ్రామస్తులు.. అడ్డుకున్న పోలీసులు!

KCR Farm House | తెలంగాణ ఎన్నికల తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. బిఆర్ఎస్ పార్టీ ఓటమి వల్లనే ఆయన ప్రగతిభవన్ నుంచి తన ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన బయటకి రాలేదు. పార్టీ నేతలతో, కార్యకర్తలతో అక్కడే సమావేశాలు జరుపుతున్నారు.

KCR Farm House | కేసీఆర్‌ను కలిసేందుకు ఫామ్ హౌస్ వెళ్లిన చింతమడక గ్రామస్తులు.. అడ్డుకున్న పోలీసులు!
Advertisement

KCR Farm House | తెలంగాణ ఎన్నికల తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. బిఆర్ఎస్ పార్టీ ఓటమి వల్లనే ఆయన ప్రగతిభవన్ నుంచి తన ఫామ్ హౌస్‌కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన బయటకి రాలేదు. పార్టీ నేతలతో, కార్యకర్తలతో అక్కడే సమావేశాలు జరుపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనను కలవడానికి ఆయన స్వగ్రామం అయిన చింతమడక నుంచి 540 మంది గ్రామస్తులు.. 9 బస్సుల్లో ఎర్రవెల్లికి తరలి వెళ్లారు. అయితే ఫామ్ హౌస్ చెక్‌పోస్ట్ వద్ద వారందరినీ పోలీసులు అడ్డుకున్నారు. కేసీఆర్‌ను కలవడానికి వారికి అనుమతి లేదని చెప్పారు. పోలీసులు నిరాకరించినా గ్రామస్తులంతా కేసిఆర్‌ను కలిసేంతవరకు తిరిగి వెళ్లమని రోడ్డుపైనే కూర్చున్నారని సమాచారం.

Advertisement

ఇంతకుముందు నవంబర్ 30 పోలింగ్ రోజున, కేసిఆర్ సొంతగ్రామమైన చింతమడకలో ఉదయం నుంచి ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. కానీ 11.30 సమయానికి కేసీఆర్ ఆయన సతీమణి ఓటు వేసేందుకు రాగానే ఒక్కసారిగా ఓటర్లు భారీ సంఖ్యలో లైన్‌లో నిలబడ్డారు. ఓటు వేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దగ్గర నుంచి చూడొచ్చనేది వారి ఆశ. దీనిని బట్టి తెలుస్తోంది.. కేసీఆర్‌పై వారి అభిమానం.

సిద్ధిపేట నియోజకవర్గం పరిధిలోకి చింతమడక గ్రామం వస్తుంది. అక్కడి నుంచి కేసిఆర్ మేనల్లుడు హరీష్ రావు పోటీ చేసి గెలిచారు. కేసిఆర్ కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఆ నియోజకవర్గాల్లో ఆయనకు ఓటులేదు. ఈ కారణంగా ఆయన నిలబడిన రెండు చోట్ల తన కోసం తాను ఓటు వేసుకోలేకపోయారు. చింతమడకలో ఓటు వేయడం వల్ల కేసీఆర్ ఓటు హరీష్ రావు ఖాతాలో పడింది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×