E-Paper
Advertisement

Telangana: విద్యార్థులకు అలర్ట్..! నేడు ప్రైవేటు విద్యాసంస్థలు బంద్..

Telangana: విద్యార్థులకు అలర్ట్..!  నేడు ప్రైవేటు విద్యాసంస్థలు బంద్..
Advertisement

Telangana: విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాల భౌతిక దాడికి నిరసనగా ఇవాళ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల బంద్‌ పాటించాలని కోరారు. చందాల కోసం వెళ్లి ఓ స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి సంఘాలు దాడికి పాల్పడ్డాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా విద్యార్థి సంఘం నాయకులపై హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ తెలిపింది. దీంతో స్కూల్‌ యాజమాన్యంపై భౌతిక దాడికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ప్రకటించాయి. విద్యార్థి సంఘాలు చందాల దందా నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలంగాణలో విద్యారంగంలో జరుగుతున్న ఘర్షణలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న బుధవారం హనుమకొండలోని స్మైల్ డీజీ స్కూల్ కరస్పాండెంట్ ఎస్. శ్రీనివాస్ వర్మపై పీడీఎస్‌యూ నాయకులు దాడి చేశారు. ఈ దాడి ‘చందాల’ కసం వచ్చి దాటి చేశారని తెలిపారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థుల నుంచి అనుమతి లేకుండా చందాలు వసూలు చేస్తోందని విమర్శించిన పీడీఎస్‌యూ నాయకులు, ఈ విషయంపై చర్చించడానికి స్కూల్‌కు చేరుకుని దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

Advertisement

దీంతో హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో పీడీఎస్‌యూ నాయకులపై కేసు నమోదు చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్ ఈ దాడిని ఖండించి, దీనికి నిరసనగా నేడు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు బంద్‌కు పిలుపు నిచ్చింది. పీఎస్‌టీ, టీపీజేఎమ్‌ఏ, కేయూపీఎమ్‌ఏ కూడా ఈ బంద్‌కు మద్దతు తెలిపారు.

అయితే బంద్ పాటించేందుకు కేజీ నుంచి పీజీ వరకు అన్ని ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేయాలని అసోసియేషన్‌లు కోరాయి. దాడిని ఖండించేందుకు స్కూల్స్ కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకు సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వద్ద సమావేశమై నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ తర్వాత కలెక్టర్, జిల్లా పోలీసు అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించి, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేయనున్నారు. బంద్ సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భద్రతా కారణాల వల్ల ఇబ్బంది పడకుండా చూడాలని అసోసియేషన్‌లు సూచించాయి.

Advertisement

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×