BigTV English

CM KCR : మాటల గారడీ.. ప్రజలు జాగ్రత్త .. తెలంగాణ ఎన్నికల్లో వినూత్న ప్రచారం..

CM KCR : మాటల గారడీ.. ప్రజలు జాగ్రత్త .. తెలంగాణ ఎన్నికల్లో వినూత్న ప్రచారం..
KCR latest news telugu

KCR latest news telugu(Political news today telangana):

తెలంగాణలో కేసీఆర్ ప్రజలకు మాయమాటలు చెప్పడంలో మహాదిట్ట అని ప్రతిపక్ష నేతలు అంటూ ఉంటారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తారని టాక్. ‘ఏం కేసీఆర్ మీద నమ్మకం లే..’ అంటారు. ఏదొక రకంగా ప్రజలకు
ఆశ పెట్టి ఆ ఓటు వేయించుకుంటారు. మళ్లీ కనిపించరు. కారు  కూడా దిగరని అంటున్నారు. అందుకనే ఆ మాటల గారడీ వారువస్తున్నారు జాగ్రత్త అంటూ కాంగ్రెస్ నేతలు ప్రజలను హెచ్చరిస్తున్నారు.


సభలు, సమావేశాలు పలు సందర్భాల్లో కేసీఆర్ మాటల గారడీ ఎలా ఉందో వివరిస్తున్నారు. అవేమిటో ఒకసారి చూడండి.

1. కేసీఆర్ మాటంటే మాటే..
2. మాటిచ్చారంటే ప్రాణం పోయినా వెనక్కి వెళ్లరు
3. మెడమీద తలకాయ లేని కేసీఆర్ ని చూస్తే ఎలాగుంటది, అలాగే
   మాట తప్పిన కేసీఆర్ ని సూసినా అలాగే ఉంటది..
4. నా మీద నమ్మకం లేదా?
5. ఏంవయ్యా మనం గొప్పోళ్లమయ్యా నాకర్థం కాదు..
6. నేను సీఎం.. నాకెన్ని పనులుంటాయో మీకు తెలుసా?
7.అదీ కత.. అలాగుంటది ఈళ్లతోటి..
8. మౌలిక విషయాలన్నీ పక్కన పెట్టి.. కేసీఆర్ నీ ముక్కు పెద్దగా ఉన్నదని ఒకడంటాడు.. ఇదావయ్ మాట్లాడేది..
9.నీదేదో సూస్తుంటే.. ఏదో కిరికిరి పంచాయతీ పెట్టేలాగే కనిపిస్తాంది
10. మీరు కేసీఆర్ తో పెట్టుకోలేరు.. కొంచెం జాగర్త
11. ఏం చేద్దామంటావు మరి.. ఏం దిక్కుమాలిన ప్రశ్నయ్యా ఇది..
12. ఏం దుర్మార్గమయ్యా ఇది… నాకర్థం కాదు..
13. నా ప్రాణం పోయినా నేను కాంప్రమైజ్ కాను


ఇలాంటి డైలాగులు అలవోకగా చెబుతారు. దయచేసి చూసుకోండి. మాటల గారడీలతో బురిడీలు కొట్టిస్తారు. ఇప్పటికే పదేళ్లు గడిచిపోయింది. అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. మాటలతోనే కోటలు దాటిస్తారు. మాటలు తప్ప చేతలేమీ ఉండవు…మాటల కోతలు తప్ప అంతా శూన్యమని ప్రతిపక్ష నేతలు పదే పదే నొక్కి వక్కానిస్తున్నారు.

బీఆర్ఎస్ నేతలని చెప్పింది చాలు, చేసిన హామీలు చాలు అని ప్రజలు అనడంతో వాళ్లు దిక్కుతోచక వెనక్కి మళ్లుతున్నారు. కొన్నిచోట్ల గ్రామాల్లోకి రానివ్వడం లేదు. ఇంత వ్యతిరేకత ఉంటుందని వాళ్లు ఊహించకపోవడంతో అంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×