Big Stories

CM KCR: ఎన్నైనా అనుకోండి.. నేను చేసేదే చేస్తా.. కేసీఆర్ స్టైల్!?

cm kcr

CM KCR: సీఎం కేసీఆర్. మాటల మాంత్రికుడని పేరు. ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఎక్స్‌పర్ట్. దాడి చేయడంలోనూ, ఎదురుదాడికి దిగడంలోనూ దిట్ట. అలాంటి కేసీఆర్.. ఇటీవల మౌనమే తన వ్యూహం అనేలా వ్యవహరిస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని నెలలైందో. తనపై, తన పాలనపై ఎన్ని విమర్శలు వస్తున్నా.. గులాబీ కోటపై తీవ్రస్థాయిలో మాటల దాడి జరుగుతున్నా.. ఆయన మాత్రం మౌనంగానే ఉంటున్నారు. తన స్టైల్‌కి భిన్నంగా తన పని తాను చేసుకుపోతున్నారు. ఎందుకిలా? కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి?

- Advertisement -

ఇటీవల బీఆర్ఎస్ మీటింగ్ జరిగింది. అందులో మంత్రి నిరంజన్‌రెడ్డికి క్లాస్ ఇచ్చారు కేసీఆర్. ఎవడో తలమాసినోడు ఏదో ఆరోపణ చేస్తే.. నువ్ ప్రెస్‌మీట్ పెట్టి కౌంటర్ ఇస్తావా? నీకేం పని లేదా? నీపని నువ్ చేసుకో.. అంటూ రఘునందన్‌రావు విషయంలో గట్టిగానే చెప్పారు గులాబీ బాస్. ఈ సలహా మంత్రికి ఇవ్వడమే కాదు.. తానూ అదే ఫాలో అవుతున్నట్టున్నారు.

- Advertisement -

శుక్రవారం, సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా సోమేశ్ కుమార్ దర్జాగా తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆయన నియామక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచీ ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సోమేశ్ కుమార్ అలా.. సోమేశ్ కుమార్ ఇలా అంటూ అంతా నోరు పారేసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా సమాధానం చెప్పలేదు. అలా వివాదం మధ్యే సోమేశ్ తన సీట్లో కూర్చున్నారు. కథ సమాప్తం.

సోమేశ్ కుమార్ అనే కాదు.. ఇటీవల మహారాష్ట్రకు చెందిన శరద్ మర్కడ్‌ను తనకు పర్సనల్ సెక్రటరీగా నియమిస్తూ.. ప్రభుత్వం తరఫున నెలకు లక్షన్నర జీతం ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వడమూ కాంట్రవర్సీగా మారింది. తెలంగాణలో నిరుద్యోగులు లేరా? పక్కరాష్ట్రం వారికి ఉపాధి కల్పిస్తారా? అయినా, బీఆర్ఎస్‌లో చేరిన వ్యక్తికి.. ప్రభుత్వం తరఫున జీతం చెల్లించడమేంటి? ఇలా అనేక విమర్శలు వచ్చాయి. అయినా, సర్కారు నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ.. నో ఆన్సర్.

ORR లీజు విషయంలోనూ అంతే. బంగారు బాతులాంటి ఓఆర్ఆర్‌ను అతితక్కువ ధరకు 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడంపై విపక్షాలు మండిపడ్డాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వరుస ప్రెస్‌మీట్లతో ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే ఆ లీజు రద్దు చేస్తామని.. అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయినా, కేసీఆర్ అండ్ కో నుంచి నో రియాక్షన్.

హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో నిబంధనలకు విరుద్దంగా బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వడం వెనుకా భారీ మొత్తంలో చేతులు మారాయని రేవంత్‌రెడ్డి ఆ ఇష్యూని బయటకు లాగారు. అందుకు సంబంధించిన జీవోను బయటపెట్టి నిలదీశారు. అయినా, నో ఆన్సర్.

TSPSC ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఎంత రచ్చ అవుతోందో. ఐదు పరీక్షలు రద్దు అయ్యాయి. లక్షలాది మంది నిరుద్యోగులు ఆగమయ్యారు. ప్రతిపక్షాలు నిరుద్యోగ మార్చ్‌లు, సభలతో లొల్లిలొల్లి చేస్తున్నారు. పేపర్ లీక్‌కు బాధ్యుడిని చేసి మంత్రి కేటీఆర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందేనంటూ గట్టిగా పట్టుబడుతున్నారు. అయినా, నో రియాక్షన్. అటు కేటీఆర్ కానీ, ఇటు కేసీఆర్ కానీ.. ఈ ఇష్యూపై నోరు మెదపడం లేదు. ఎందుకు?

ఇక, గొప్పగా కట్టిన కొత్త సచివాలయంలోకి కూడా విపక్ష నేతలను రానివ్వటం లేదు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీజేఎస్.. ఇలా అన్నిపార్టీల నాయకులను అడ్డుకుంటున్నారు. ఇదేమీ రాజ్యం? అని ప్రశ్నిస్తున్నా.. సైలెన్సే సమాధానం.

ఎందుకిలా? కేసీఆర్ ఎందుకలా మౌన వ్రతం పాటిస్తున్నారు? జవాబు చెప్పుకోలేకనా? విపక్షాల ప్రశ్నలకు తనదగ్గర సమాధానం లేకనా? లేదంటే, వ్యూహాత్మక మౌనమా? వాళ్లును అలానే వదిలేస్తే.. నమ్మే వాళ్లు నమ్ముతారు.. నమ్మని వాళ్లు నమ్మరు.. అదే ప్రతిపక్షాలకు తాను సమాధానం ఇస్తే.. ఆ టాపిక్‌కు మరింత ప్రయారిటీ పెరుగుతుందనా? రచ్చ మరింత రాజుకుంటుందనా? ఎన్నికల ముందు ఎన్నోన్నో అంటుంటారు.. అన్నిటికీ సమాధానం చెప్పేదేంది అనుకుంటున్నారా? కేసీఆర్ ఈమధ్య మీడియా ముందుకు రావట్లేదెందుకు? ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడం లేదెందుకు?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News