E-Paper
Advertisement

Telangana Council Session-2026: హైదరాబాద్ సిటీ అభివృద్ధి.. మూసీ ప్రాజెక్టుపై మండలిలో సీఎం రేవంత్ ప్రకటన

Telangana Council Session-2026: హైదరాబాద్ సిటీ అభివృద్ధి.. మూసీ ప్రాజెక్టుపై మండలిలో సీఎం రేవంత్ ప్రకటన
Advertisement

Telangana Council Session-2026: పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ సిటీని ఏ విధంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో క్లియర్ వివరించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ అనేది ఓ చారిత్రాత్మక నగరమని, కుతుబ్‌షాహీలు, అనేక ప్రభుత్వాలు ఈ నగరాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. దేశంలో ప్రధానంగా ఐదు నగరాల గురించే చర్చించుకుంటారని అన్నారు. ఢిల్లీ.. పొలిటికల్ రాజధాని, ముంబై ఆర్థిక రాజధాని, బెంగుళూరు ఐటీ రాజధాని, చెన్నై ఆటోమొబైల్ పరిశ్రమ, హైదరాబాద్ ఫార్మా రాజధానిగా గుర్తింపు ఉందన్నారు.

హైదరాబాద్ సిటీ అభివృద్ధి.. మూసీ ప్రాజెక్టుపై సీఎం ప్రకటన

Advertisement

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం మండలిలో మాట్లాడారు ముఖ్యమంత్రి. దేశం ఆర్థిక ప్రగతి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఐదు నగరాల నుంచే ఉందన్నారు. రాజధాని ఢిల్లీ ప్రధానంగా కాలుష్య సమస్యలతో సతమతమవుతుందన్నారు. కాలుష్య నియంత్రణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకొంటున్నారని గుర్తు చేశారు.

ఇక హైదరాబాద్ సిటీలో మానవ తప్పదాల వల్ల సమస్యలు ఏర్పడ్డాయన్నారు. చాలామంది ఉద్యోగాలు చేయడం వల్ల ఒక్కో కుటుంబం రెండు లేదా మూడు కార్లు కొనుగోలు పరిస్థితి ఉందన్నారు. కార్లలో ప్రయాణించాలంటే రోడ్లు విస్తరణ, పార్కింగ్ వద్ద సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు.  రవాణాలో రోడ్లు, ఎయిర్ పోర్టులు, రైల్వేలు, సీ పోర్టులు ప్రధాన పాత్ర పోషిస్తాయని అన్నారు.

Advertisement

ఒకప్పుడు బేగం‌పేట ఎయిర్‌పోర్టును శంషాబాద్‌కు మారిందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీవ్రమైన ఒత్తిడితో చర్లపల్లిలో కొత్తగా నిర్మాణం జరుగుతోందన్నారు. మెట్రో విస్తరించడం వల్ల అనేక సమస్యలకు చెక్ పడనుందన్నారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై ఫోకస్ చేసినట్టు తెలిపారు.

ప్రతిపక్షం సూచనలను స్వీకరించడానికి సిద్ధం: సీఎం రేవంత్

నగరంలో ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురయ్యాయని, చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలిగినా ఆక్రమణలు తొలగింపు తప్పదన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పలు రకాల సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. కాలుష్యం, రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయన్నారు. ట్రాఫిక్ నియంత్రించలేనంత పరిస్థితి ఉందన్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం మూడు జోన్లుగా విభజించిందన్నారు.

కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తే ఎక్కువ భూమి అందుబాటులోకి వస్తుందన్నారు. దీనివల్ల అపార్టుమెంట్లు, హౌసింగ్ నిర్మాణాలు జరుగుతాయన్నారు. ఓఆర్ఆర్-రీజనల్ రింగ్ రోడ్ల మధ్య రేడియల్ రోడ్లు వేస్తున్నట్లు తెలిపారు. సిటీ మధ్యలో ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. దీనికి ఎలాంటి భూసేకరణ ఉందని తేల్చి చెప్పారు.

హైదరాబాద్ అద్భుతమైన నగరంగా మారుతుందన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల ఎవరిని నిరాశ్రయులుగా మార్చమని మరోసారి మాట ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. అభివృద్ధిలో భాగంగా నష్టపోయే వారికి పునరావాసం కల్పిస్తామని సభలో తేల్చి చెప్పారు. వారికి మెరుగైన జీవన ప్రమాణాలను పెంచుతామని, ఆర్థిక సహకారం అందిస్తామని వెల్లడించారు.

ALSO READ: రేవంత్ రెడ్డి తోపు లీడర్.. మేమిద్దరం అన్నదమ్ములం, మల్లారెడ్డి పొగడ్తలు

రాజకీయ ప్రయోజనాల కోసం ఉసిగొల్పే వారి ఉచ్చులో పడవద్దని వారికి సూచన చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులను పరివాహక ప్రాంతానికి పంపించి పేదలకు సమగ్రంగా వివరిస్తామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఇప్పుడు అభివృద్ధే తమ లక్ష్యమన్నారు. దయచేసి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై అపోహలు సృష్టించి రాజకీయం చేయొద్దని కోరారు.

ప్రతిపక్షం సూచనలను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆపేస్తామనే విధానం కాకుండా ముందుకు వెళ్లడానికి అవసరమైన సలహాలు ఇవ్వాలన్నారు. ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే నూటికి నూరు శాతం అమలు చేస్తాం కుండబద్దలు కొట్టేశారు.

 

 

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×