Big Stories

CM Revanth Reddy : ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 25లక్షల పురస్కారం..

TS News updates

CM Revanth Reddy news today(TS news updates): తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఒక్కొక్కరికి రూ.25 లక్షల పురస్కారాన్ని ప్రభుత్వం తరుపున అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి నెల రూ.25 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆదివారం శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా సీఎం పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించి మాట్లాడారు.

- Advertisement -

పద్మ అవార్డు గ్రహితలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించామని సీఎం రేవంత్ రెడ్డిత తెలిపారు. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమమని పేర్కొన్నారు. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే అన్నారు. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

- Advertisement -

అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే.. ప్రజా పాలనను అభినందించినట్తలే సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి నెల పద్మశ్రీ అవార్డు పొందినటువంటి కవులు, కళాకారులకు రూ.25వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మనమంతా ఏకమై ముందుకు సాగాలని సీఎం పిలుపునిచ్చారు.

ఒక తెలుగువాడిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. వెంకయ్య నాయుడును సన్మానించడం అంటే మనల్ని మనమే సన్మానించుకోవడమన్నారు. మెగాస్టార్ చిరంజీవి జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఒక్కడిగా వచ్చి.. ఒక్కొక్కటి సాధిస్తూ ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. చిరంజీివి పున్నమినాగులో ఏ స్థాయిలో నటించారో.. సైరాలోనూ అదే స్థాయిలో నటించారని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News