BigTV English

CM Revanth Reddy: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలిదానం.. ప్రెస్ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy:  బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలిదానం.. ప్రెస్ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ బలిదానం చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన అందరికీ అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నచ్చి లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వేశారని, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం గుండు సున్నా పెట్టారన్నారు. కనీసం రాష్ట్ర అవతరణ వేడుకలకు కూడా కేసీఆర్ హాజరుకాలేదని విమర్శించారు. కుటుంబం స్వార్థం, పార్టీ మనుగడ, ఆస్తులు కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికైనా అతని సరళిని మార్చుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన కుట్రలతో కాంగ్రెస్ మిగతా 8 చోట్ల ఓడిపోయిందని వెల్లడించారు. కేసీఆర్.. రాజకీయ జూదగాడని, కేసీఆర్ ఉన్నంతకాలం కుట్రలు ఉంటాయన్నారు.


బీజేపీకి 22శాతం ఓట్లు బదిలీ..

2001లో టీడీపీకి కేసీఆర్ రాజీనామా చేసి సిద్ధిపేట నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేశారని సీఎం అన్నారు. అప్పటినుంచి 2023 డిసెంబర్ వరకు సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లో 25వేల నుంచి లక్ష మెజార్టీ వరకు సాధించిందన్నారు. కానీ అత్యధిక మెజార్టీ వచ్చే సిద్ధిపేటలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు..బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి బదిలీ చేశారని విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావులు ఇద్దరూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు బదిలీ చేశారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిని మోసం చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ దాదాపు 22శాతం ఓట్లను బదిలీ చేసినట్లు చెప్పారు. దీంతో బీజేపీ 8 చోట్ల గెలిచి.. బీఆర్ఎస్ డిపాజిట్లను గల్లంతైందన్నారు.


Also Read: తెలంగాణలో ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్ మొదలు, గెలుపెవరిది?

ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమే ప్రత్యామ్నాయం..

ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమే ప్రత్యామ్నాయమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగిందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దేశంలో పరిస్థితి మారిందన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు.  కాంగ్రెస్ పాలన నచ్చితేనే ఓటు వేయాలని ప్రజలను కోరామని సీఎం చెప్పారు.

కాంగ్రెస్ పాలనపై సంతృప్తి..

కాంగ్రెస్ పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో వందరోజుల్లో గ్యారంటీలను అమలు చేశామని, కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన ఫలితాలు వచ్చాయ్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 41శాతం ఓట్లు వచ్చాయన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో 8 సీట్లు అధికంగా ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమి సమానంగా పోటీ పడిందని చెప్పారు. ఈ ఎన్నికలు వంద రోజుల పరిపాలనకు రెఫరెండం అని చెప్పారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×